బడ్జెట్ లో మహిళలకు పెద్ద పీట - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బడ్జెట్ లో మహిళలకు పెద్ద పీట


న్యూఢిల్లీ, జూలై 3, (way2newstv.com)
నిర్మలా సీతారామన్ తొలిసారి ఆర్థిక మంత్రిగా మోడీ క్యాబినెట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. జులై 5న జాతీయ బడ్జెట్‌ 2019-20కు ముహూర్తం ఖరారవగా మహిళల కోసం ఎంతవరకూ కేటాయించారోనని ప్రశ్నలు తలెత్తుతుంటే ఇది పూర్తిగా మహిళలకు అనుకూలంగా ఉండే బడ్జెటేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అలా ఉండాలంటే ఏ విషయాలు పరిగణనలోకి తీసుకోవాలంటే..
1. ఆర్థిక శాఖ దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సామాన్యుల నుంచి సర్వే తీసుకుని ప్రత్యేకంగా మహిళల అభిప్రాయాలను సేకరించారు. ఈ బడ్జెట్‌తో నిర్మలా సీతారామన్ మహిళల కలలను సాకారం చేయాలని ఆశిస్తున్నారు. 
2. మహిళా పెట్టుబడులను ప్రోత్సహించేలా ఉండనుంది. నీల్సన్-బ్రిటానియా సర్వే ఆధారంగా 48శాతం గృహిణులు కొత్త వ్యాపారాలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారట. నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలనుకుంటున్నారు. 


బడ్జెట్ లో మహిళలకు పెద్ద పీట

3. మహిళల భద్రతలోనూ ఈ బడ్జెట్ కీలకంగా వ్యవహరించనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జన సంచారం ఉన్న ప్రాంతాల్లో మహిళలకు భద్రత కల్పించేలా కొత్త టెక్నాలజీతో ప్రతి ప్రాంతాన్ని మానిటరింగ్ చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో సీసీ కెమరాలు, ఫోన్లు, పెట్రోలింగ్ సిబ్బందిపై దృష్టి సారించారు. 
4. పరిశ్రమల్లో  పనిచేస్తున్న మహిళల శాతం క్రమంగా తగ్గుతూ వస్తుంది. 2016లో 32శాతం ఉండగా 2018కి 23శాతానికి పడిపోయింది. ప్రతి ఒక్కరూ కార్పొరేట్ ప్రపంచంపై ఆసక్తి చూపిస్తుండటంతో పరిశ్రమల్లో దినసరి కూలీలు తగ్గిపోతున్నారు. ఫలితంగా సొంత వ్యాపారాలకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు.  
5. సెక్షన్ 80సీ ప్రకారం.. ఐటీ  మినహాయింపును మరింత పెంచనున్నారు. మహిళా ఉద్యోగినులు ప్రావిడెంట్ ఫండ్‌ను తొలి మూడేళ్లు 12 నుంచి 8శాతానికి తగ్గించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 
6. రోజువారీ వస్తువులపైనా.. అంటే చిరుద్యోగులు, చిన్నారులు వాడే ఫేస్ క్రీమ్ ల వంటి వాటిపై ట్యాక్స్ అమౌంట్ తగ్గించనున్నారట. 
7. గృహిణులకు ప్రాధాన్యతనిస్తూ.. గ్రామీణ మహిళలకు ఆరోగ్యం గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు.