అసెంబ్లీలో కనిపించని నందమూరి వారసుడు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అసెంబ్లీలో కనిపించని నందమూరి వారసుడు

విజయవాడ, జూలై 25, (way2newstv.com)
నంతపురం జిల్లా హిందూపురం ఎమ్యెల్యే హీరో నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాల్లో కానరాకపోవడం చర్చనీయాంశంగా మారింది. హాట్ హాట్ గా సాగుతున్న ఎపి అసెంబ్లీలో అంతా చంద్రబాబు చేతుల మీదుగానే టిడిపి షో రన్ చేసేస్తోంది. ఉన్నదే 23 మంది. వారిలో కొందరు గైర్హాజరు అవుతుండటంతో మరింత పలచగా కనిపిస్తుంది విపక్షం. చంద్రబాబు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ లు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు మాత్రమే విపక్ష నేతకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మిగిలిన వారంతా ప్రేక్షక పాత్రే పోషిస్తున్నారు. కొంతలో కొంత పయ్యావుల కేశవ్ గొంతు లేస్తున్నా ఆయన కు వచ్చే ఛాన్స్ లే తక్కువ.టిడిపి లో చంద్రబాబు తరువాత ఎవరు అనే చర్చ ఎన్నికల్లో పరాజయం తరువాత బాగా నడుస్తుంది. యువనేత నారా లోకేష్ స్వయంగా మంగళగిరిలో మంగళం పాడేయడంతో ఆయన నాయకత్వంపై నేతల్లో విశ్వాసం సన్నగిల్లింది. 
అసెంబ్లీలో కనిపించని నందమూరి వారసుడు

చంద్రబాబు సారథ్యంలోనే పార్టీ సాగాలని అంతా ఇంటా బయట మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. దాంతో తెరపైకి అనేకరకాల చర్చలునడుస్తున్నాయి. నందమూరి కుటుంబమే టిడిపిని కాపాడేదంటూ పసుపు సర్కిల్స్ లో టాక్. లోకేష్ స్థానంలో నందమూరి బాలకృష్ణ లేదా బ్రాహ్మిణి సీన్ లోకి చంద్రబాబు దింపాలని వారికి ఇప్పటినుంచి పాఠాలు నేర్పి భావి నేతను ప్రసాదించాలని కోరుకుంటున్నారు.మరో పక్క 2009 ఎన్నికల్లో టిడిపి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేసి చంద్రబాబు రాజకీయంతో దూరమైనా జూనియర్ ఎన్టీఆర్ ను కూడా కలుపుకుని పార్టీని ఉత్తేజితం చేయాలని పలువురు సూచిస్తున్నారు. ఇలాంటి చర్చలు పెరిగిపోతూ ఉండటంతో చంద్రబాబే నందమూరి బాలకృష్ణను దూరం చేశారని అంటున్నారు. ఆయన ఏమి మాట్లాడిన వివాదాలు మరింత పెరుగుతాయని ఆందోళన తో బాటు మరీ యాక్టివ్ అయితే బాలయ్య బాబు అధినేత కుర్చీపై కన్నేస్తే ప్రమాదమని గుర్తించే అయన అటెండన్స్ ను సీరియస్ గా తీసుకోవడం లేదని అసెంబ్లీ లాబీల్లో వైసిపి వర్గాల్లో హాట్ టాపికి నడుస్తుంది. ప్రస్తుతం బాలయ్య బాబుకు పెద్దగా సినిమాలు కూడా లేవు. ఎపి అసెంబ్లీలో ప్రస్తుతం అతి ముఖ్యమైన తొలి బడ్జెట్ సమావేశాలను వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డాకా ప్రవేశపెట్టింది.అధికారపక్షంలో కన్నా విపక్షంలో వున్నప్పుడే చట్టసభల్లో నేతల సామర్ధ్యం బయటపడుతుంది. సినిమాల్లో అదరగొట్టే పంచ్ డైలాగ్స్ కి పెట్టింది పేరైన నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో హల్ చల్ చేస్తే టిడిపికి మైలేజ్ వచ్చేదే. ఎన్టీఆర్ వారసుడిగానే కాకుండా వెండితెర హీరో గా నందమూరి బాలకృష్ణ కు యమా క్రేజ్ టిడిపి లో వుంది. ఇటీవల అయన ఎన్నికల ప్రచారంలో ఎక్కడో అక్కడ అభిమానులపై తనదైన శైలిలో విరుచుకుపడినా దాన్ని అందరు లైట్ తీసుకున్నారు. నందమూరి బాలకృష్ణ స్టయిల్ అంతేగా అనుకున్నారు. అలాంటి నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాలపై సీరియస్ గా దృష్టి పెట్టకపోవడంతో అటు పార్టీకి ఇటు అభిమానులకు నిరుత్సహమే మిగిలింది. ఈ సమావేశాల్లో తన గళాన్ని పంచ్ డైలాగ్స్ తో వినిపిస్తాడని ఎంతో ఆశగా చూసిన బాలయ్య ఫ్యాన్స్ ఇప్పుడు నిరాశ పడుతున్నారు. మరి తన అభిమానుల ఆశ బాలయ్య తీరుస్తారా ప్రభుత్వం పై తనదైన విమర్శలు ఎక్కుపెట్టి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం ఇప్పటికైనా చేస్తారో లేదో చూడాలి.