జగిత్యాల జూలై 16, (way2newstv.com)
సంపూర్ణ చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకులు, నిర్వాహకులు తెలిపారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలయిన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంను మధ్యహ్నం 12:30 గంటల నుండి మూసివేసి 17 న బుధవారం ఉదయం తెరవనున్నట్లు ఆలయ ఈవో ఆమరేందర్ తెలిపారు.
చంద్ర గ్రహణం కారణంగా ఆలయాల మూసివేత.
అలాగే ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కూడా మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మరుసటి రోజు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తుల దైవ దర్శనకు ఏర్పట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Tags:
News