మేన్‌ వర్సెస్‌ వైల్డ్‌' పాపులర్‌ షో లో కనిపించనున్న మోడీ

న్యూఢిల్లీ, జూలై 30, (way2newstv.com
దమ్ము, ధైర్యం, సాహసం, సమయస్ఫూర్తి.. ఇవన్నీ పుష్కలంగా ఉన్న వ్యక్తి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. రాజకీయాల్లో ఎవరెదురొచ్చినా తన చాతుర్యంతో చిత్తు చేసే మోడీ.. క్రూర మృగాలు, విష సర్పాలు ఎదురైతే ఎలా డీల్ చేస్తారు? నదులు అడ్డొస్తే ఎలా దాటుతారు? అడవిలో ఉండాల్సి వస్తే అసలు ఆయనేం చేస్తారు..? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మరో 15 రోజులు ఆగాల్సిందే. ఇంతకీ విషయమేంటంటే.. డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారమయ్యే పాపులర్ షో 'మేన్ వర్సెస్ వైల్డ్‌'లో త్వరలో మన మోడీ కనపించబోతున్నారు.
మేన్‌ వర్సెస్‌ వైల్డ్‌' పాపులర్‌ షో లో కనిపించనున్న మోడీ

ప్రపంచ ప్రముఖ సాహసవీరుడు బియర్ గ్రిల్స్‌తో కలిసి మోడీ చేసిన వైల్డ్‌ జర్నీని డిస్కవరీ ఛానెల్ ఆగస్టు 12న ప్రసారం చేయబోతోంది. భారత్‌లోని వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ మార్పులపై ఈ షోలో మోడీ వివరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కొద్ది సేపటి క్రితం విడుదలైంది. ఈ షోను తప్పకుండా చూడాలని కోరుతూ బియర్ గ్రిల్స్‌ ఆ వీడియోను ట్వీట్‌ చేశాడు. మోడీ.. తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారని.. ఆయనలోని 'వైల్డ్‌ యాంగిల్‌'ను చూడాలంటే ఆగస్టు 12వరకు వెయిట్‌ చేయండి అని ట్వీట్‌లో వివరించాడు. అయితే దేశంలో ఎన్నో సమస్యలుంటే.. ప్రధాని సెలబ్రిటీలా ఇలా వీడియోలు చేయడంపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Previous Post Next Post