సరిలేరు నీకెవ్వరులో బండ్ల గణేష్... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సరిలేరు నీకెవ్వరులో బండ్ల గణేష్...

హైద్రాబాద్, జూలై 24, (way2newstv.com)
నటుడుగా మొఖానికి మేకప్ వేసుకొని చాలా రోజులు అయింది బండ్ల గణేష్ .. నటుడుగా సినిమాలు మానేసి నిర్మాతగా భాద్యతలు తీసుకున్నారు . అ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి బిజీ బిజీ అయిపోయారు . అయన చివరగా నటించిన సినిమా బిజినెస్ మన్ .. అ తర్వాత బండ్ల నటించింది లేదు . మహేష్ బాబు తాజా సినిమా సరిలేరు నికేవ్వరులో ఓ ముఖ్య పాత్రలో బండ్ల గణేష్ కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి .
                          సరిలేరు నీకెవ్వరులో బండ్ల గణేష్...

దీనిపైన బండ్ల గణేష్ కుడా స్పందించాడు . మంచి కామెడిని పండించగల దర్శకుడిగా పేరున్న అనిల్ , బండ్ల కోసం ఓ పాత్రను క్రియేట్ చేసారట .. సినిమాలో భాగంగా వచ్చే ఓ ట్రైన్ ఎపిసోడ్ లో బండ్ల కనిపించనున్నారు . దీనిపైన షూట్ ఈ నెల 26 నుండి అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్ లో జరగాల్సి ఉంది. కానీ దీనిపైన చిత్ర నిర్మాతలు బండ్లని మీట్ అయింది లేదు . అయితే బండ్ల గణేష్ మాత్రం విదేశాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్తునట్లు తెలుస్తుంది . మరి ఇందులో బండ్ల గణేష్ నటిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది . ఇందులో మహేష్ సరసన రష్మిక మందన్నా నటిస్తుంది . దిల్ రాజు నిర్మాత . ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు