తిరుపతి, జూలై 26, (way2newstv.com)
అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అం దించేందుకు ప్రభుత్వం కోడిగుడ్లను పంపిణీ చేసే ది. అయితే వారం రోజులుగా అంగన్‌వాడీ కేంద్రాల్లో గుడ్డు లేకుండానే ఆహారం పంపిణీ చేస్తున్నారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) ద్వారా అమలవుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాకపోవడంతోనే కోడిగుడ్ల సరఫరా నిలిచిపోయిందని ఈ సమస్య రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నెలకొందని అధికారులు పేర్కొంటున్నారు.
అంగన్ వాడీల్లో కనిపించని గుడ్డు
వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నా కోడి గుడ్లు అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడంలో ఘోరంగా విఫలమైంది.ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యంతో అంగన్‌వాడీ చి న్నారులు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన కోడిగుడ్లు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు వారానికి నాలుగు కోడిగుడ్లను అందించాలి. ఇందుకు ఒక్కొక్క కేంద్రానికి వారానికి రంగుల ముద్రలున్న కోడిగుడ్లు వందకు పైగా అందించాల్సి ఉంది. అయితే ఈ వారానికి సంబంధించి గుడ్లు అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా కాలేదు. గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు గడువు ముగియడంతోనే గుడ్లు అందలేదన్న వాదన వినిపిస్తోంది. అధికారులు మాత్రం బిల్లులు రాకపోవడంతో గుడ్లు రాలేదంటున్నారు. వాస్తవంగా ముందు చూపుతో గడువు ముగుస్తున్న తరుణానికి ముందుగానే మళ్లీ టెండ ర్లు పిలవాల్సిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందలేదు.
Tags:
Andrapradeshnews