జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన
పెద్దపల్లి జూలై 19 (way2newstv.com)
సమాజంలో సజావుగ మానవ జీవనం సాగడానికి జమే జీవనాధారమని, దానిని సంరక్షించుకోవాలని జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన అన్నారు. జల సంరక్షణ్ జల్ ఆందోళన్ పేరిట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జేండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ మైదానంలో విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో పిల్లలు, విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి మరుగుదొడ్లను పూర్తి స్థాయిలో నిర్మించడంలో సహకరించడం వల్ల జాతీయ స్థాయిలో గర్తింపు లభించి రెండు అవార్డులు స్వీకరించామని అన్నారు.
జలమే జీవనాధారం
ప్రస్తుతం ప్రపంచంలో నీటి సమస్య చాలా పెద్ద సమస్యగా ఉందని, దీనిని నివారించి భవిష్యత్తు తరాలకు నీరు అందించడానికి అందరం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. మన రాష్ట్రానికి సమీపంలో ఉన్న చైనై మహానగరం ప్రస్తుతం నీరు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కుంటుందని, అక్కడ ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని, ట్రైయిన్ ద్వారా నీటి సరఫరా చేసే దుస్థితి వచ్చిందని, భూగర్బ జలాలు 80 శాతానికి పైగా అడుగంటిపోవడమే ఈ సమస్య తీవ్రతకు కారణమని, అదే సమయంలో మహారాష్ట్రలో సైతం నీటి సమస్య తీవ్రంగా ఉందని, బెంగళూరు మహానగరంలో నూతన నీటి సమస్యల కారణంగా అక్కడ 5 సంవత్సరాల పాటు నూతన భవన నిర్మాణాలను ప్రభుత్వం నిలిపివేసిందని కలెక్టర్ విద్యార్థులకు వివరించారు. మన రాష్ట్రంలో నీటి సమస్య తలెతకుండా ఉండేందుకు అధికారులు, ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నాలు చేస్తుందని, దానికి ప్రజలు సైతం పూర్తి స్థాయిలో సహకరించాలని కలెక్టర్ అన్నారు. గంగా జలాలను భూమి పైకి తీసుకొని రావడానిక ఆనాడు భగీరథడు చాలా కృషి చేసాడని , అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భగీరథ యత్నం చేస్తూ కాళేశ్వరం ప్రాజేక్టు నిర్మించి, గోదావరి జలాలను తీసుకొని వచ్చే విధంగా ప్రయత్నీస్తున్నారని కలెక్టర్ అన్నారు. మన గ్రామాలలో సైతం నీటి సమస్య రాకుండా మనం మన భూగర్భ జలాలను పెంచుకోవాలని, దీనికి అనుగుణంగా గ్రామాలో కురిసే ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు వివరించారు. జిల్లాలో మంచి వర్షపాతం నమోదు కావడానికి, సకాలంలొ వర్షాలు కురవడానికి పర్యావరణ సమతుల్యత అవసరమని, దీని కోసం పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో కురిసే వర్షపు నీటిని పూర్తి స్థాయిలో సమర్థవంతంగా సద్వీనియోగం చేసుకునేందుకు ప్రతి ఇంట్లో ఒక ఇంకుడుగుంతను నిర్మీంచుకొవాలని, ప్రతి రైతు వారి పోలంలో పార్మ పాండ్ నిర్మీంచుకోవాలని, దీనికి అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని, దీని పై విద్యార్థులు అవగాహన పెంచుకొని వారి తల్లిదండ్రులకు వివరించి తప్పనిసరిగ్గా వారి ఇంట్లో మరియు పోలంలో ఇంకుడు గుంత, ఫార్మ పౌండ్ నిర్మించుకునేలా చొరవ తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. మన గ్రామాలో , పట్లణాలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ ను నిషేందించాలని, దాని వాడుకను
...
Tags:
telangananews