కంప్యూటర్లు ఇచ్చారు... వదిలేశారు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కంప్యూటర్లు ఇచ్చారు... వదిలేశారు...


తిరుపతి, జూలై 1, (way2newstv.com)
సర్కారు స్కూళ్ల విద్యార్థులకు కంప్యూటర్‌ విద్య అందని ద్రాక్షగా మారింది. టీడీపీ ప్రభుత్వం టెక్నాలజీలో ముందున్నామంటూ డప్పులు కొట్టుకుంటోందే కాని.. పాఠశాలల్లోని కంప్యూటర్‌ విద్యకు టీచర్లను నియమించాలని తెలియడం లేదు. ప్రస్తుతం నిర్వహణ లోపం శాపమై కంప్యూటర్‌ విద్యను టీడీపీ ప్రభుత్వం అటకెక్కించింది. గత మూడేళ్లుగా జిల్లాలో కనీసం కంప్యూటర్‌ తరగతి గదుల తలుపులు తీసే నాథుడే కరువయ్యారు. దీంతో జిల్లాలోని 694 హైస్కూల్స్‌ లో  చదువుతున్న 2,75, 776 మంది పేద విద్యార్థులకు సాంకేతిక విద్య అందని ద్రాక్షగా మారింది.అప్పట్లో ఒక్కొక్క ఉన్నత పాఠశాలకు 11 కంప్యూటర్ల చొప్పున మొత్తం 7,634 కంప్యూటర్లను ప్రభుత్వం సరఫరా చేసింది. వాటిలో ఇప్పటికి 1,672 మానిటర్లు, 834 సీపీయూలు మరమ్మతులకు గురయ్యాయి. వాటిని జిల్లా విద్యాశాఖ అధికారులు సేకరించారు. 

కంప్యూటర్లు ఇచ్చారు... వదిలేశారు...

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నేడు రూ. కోట్ల విలువ చేసే కంప్యూటర్లు, సామాగ్రి, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులకు బూజు పట్టాయి. మరికొన్ని పాఠశాలల్లో దొంగతనాలు, ఇంకొన్ని చోట్ల హెచ్‌ఎంలే మాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరం జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు కంప్యూటర్‌ విద్య పై దృష్టి సారిస్తే పేదవిద్యార్థులకు న్యాయం చేసినట్లవుతుంది. 2010 లో ఒప్పందం కుదుర్చుకున్న ఐఈజీ కొత్తగా పాఠశాలల్లోని ప్రత్యేక గదులకు అన్ని హంగులు దిద్దడం, కంప్యూటర్లు ఏర్పాటు చేయడం వంటి పనులతో రెండేళ్లు తరగతులు నిలిచిపోయాయి. 2012 లో ఐఈజీ ద్వారా ప్రతి పాఠశాలలో కంప్యూటర్‌ శిక్షణకు వీలుగా ప్రత్యేక గదిని, 11 కంప్యూటర్లు, జనరేటర్, కుర్చీలు, పుస్తకాలు, విద్యుత్‌ సౌకర్యం వంటివి సిద్ధం చేశారు. శిక్షణ ఇచ్చేందుకు ఇద్దరు వలంటీర్లను నియమించారు. అలా రెండు విద్యాసంవత్సరాలు ఎలాగోలా గడిచిపోయాయి. 2015 లో ఐఈజీ సంస్థతో అయిదేళ్ల ఒప్పందం పూర్తయింది. ఆ తర్వాత కంప్యూటరు గదులకు వేసిన తలుపులు నేటికీ తెరుచుకోలేదు. ప్రభుత్వం పాఠశాలల్లో పనిచేసే ఇద్దరు టీచర్లకు శిక్షణ ఇచ్చి తరగతుల్ని కొనసాగించే ప్రయత్నం చేసినా... అది సత్ఫలితానివ్వలేదు. కనీసం ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోౖ¯ð నా తరగతులు కొనసాగేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు, విద్యార్థిసంఘాలు డిమాండ్‌ చేస్తున్నారు.