హరితహారంలో ప్రజలు పాల్గోనాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హరితహారంలో ప్రజలు పాల్గోనాలి

వనపర్తి, జూలై 26 (way2newstv.com)
హరితహారం కార్యక్రమం లో భాగంగా ఈ సంవత్సరం జిల్లాలో ఇప్పటివరకు సుమారు 8 లక్షల మొక్కలు నాటినట్లు జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. హరితహారం కార్యక్రమం లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.          హరితహారం కార్యక్రమం లో భాగంగా శుక్రవారం ఆమె కొత్తకోట మండలం అమడబకుల మోడల్ పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం కింద ఈ సంవత్సరం జిల్లాలో కోటి అరవై ఏడు లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా తీసుకోవడం జరిగిందని, ఇందులో భాగంగానే ఇప్పటివరకు ఐదు శాతం  (8 లక్షలు) మొక్కలు నాటడం పూర్తిచేశామని తెలిపారు. 
హరితహారంలో ప్రజలు పాల్గోనాలి

ప్రతి గ్రామంలో రహదారులకు ఇరువైపులా మొక్కలను నాటటం జరుగుతున్నదని, అంతేకాక టేకు మొక్కలు, ఇంటి పెరట్లో నాటే మొక్కలు, ఉద్యాన మొక్కలను పంపిణీ చేయడంతో పాటు వాటిని నాటుతున్నట్లు తెలిపారు. వర్షాభావం కారణంగా మొక్కలు నాటే కార్యక్రమం కొంత ఆలస్యంగా జరుగుతున్నదని వచ్చే వారం నాటికి పురోగతి వస్తుందని అన్నారు. ఈ సంవత్సరం మొక్కలు నాటడమే కాకుండా నాటిన మొక్కలను బతికించడం పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నా ము అని   వెల్లడించారు. కాగా హరితహారం కార్యక్రమం లో భాగంగా ఇప్పటివరకు జిల్లాలో 25 లక్షల గుంతల తవ్వకాన్ని పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాలలో చేపట్టే హరితహారం కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని గుంతలను తవ్వటం జరుగుతుందని, ప్రతి గ్రామంలో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులందరూ కృషి చేయవలసి ఉంది.ఈ కార్యక్రమంలో కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, అమడబకుల సర్పంచ్ బుచ్చన్న, డీఈవో సుశీందర్ రావు, పాఠశాల ప్రిన్సిపల్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని మొక్కలు నాటారు