విజయవాడ, జూలై 23, (way2newstv.com)
వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరంలో గొడుగులు, రెయిన్ కోట్లు, వాటర్ ప్రూఫ్ టోపీల అమ్మకాలు జోరందుకున్నాయి. దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతుండటంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో విద్యార్థులకు అందించే వాటిలో ముందు వరుసలో రెయిన్ కోట్లు, గొడుగులు ఉంటాయి. అలాగే ఉద్యోగాలకు వెళ్లే వారు కూడా రెయిన్ కోట్‌లు కొనుక్కుంటారు. మహిళా ఉద్యోగులైతే గొడుగుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రజల అవసరాలను గుర్తించి నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ రెయిన్ కోట్లు, గొడుగులు, టోపీలు అమ్మకాలు చేస్తున్నారు. చిన్న చిన్న షాపుల నుంచి షాపింగ్ మాల్స్ వరకు ఇవి దొరుకుతున్నాయి. నగరంలోని ద్వారకానగర్, డాబాగార్డెన్స్, జగదాంబ, ఎన్‌ఎడి, గాజువాక, గోపాలపట్నం ప్రాంతాల్లో రెయిన్ కోట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
టెక్నాలజీకి తగ్గట్టుగా గోడుగుల డిజైన్లు
అమ్మకాలను దృష్టిలో ఉంచుకుని రకరకాల మోడళ్లను వ్యాపారులు అందుబాటులోకి తెచ్చారు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కుటుంబీకులు షాపింగ్‌మాల్స్‌లో వీటిని కొనుగోలు చేస్తుండగా, సామాన్య ప్రజలు ఫుట్‌పాత్‌పై లభించే రెయిన్ కోట్లను కొనుగోలు చేస్తున్నారు.నగరంలో ఏ షాపులో చూసినా పదుల సంఖ్యలో మోడళ్లు అందుబాటులో ఉంటున్నాయి. లేడీస్, బార్సు, కిడ్స్‌కు సంబంధించిన పలు రకాల రెయిన్ కోట్లు దొరుకుతున్నాయి. రెయిన్ కోట్లలో బ్రాండెడ్, సాధారణ రకాలను విడివిడిగా విక్రయిస్తున్నారు. బ్రాండెడ్‌లో డెక్ బాక్ జీల్, రీలైబల్, ట్రోఫికల్ వంటి పదుల సంఖ్యలో బ్రాండెడ్ రెయిన్ కోట్స్ ఉన్నాయి. రెయిన్ కోట్‌లకు సంబంధించి జెంట్స్‌కు ఫ్యాంట్, షర్ట్, లాంగ్ కోట్ ఉండగా, లేడీస్‌కు లాంగ్ కోట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చిన్నారులకు రెండూ అందుబాటులో ఉన్నాయి. వారికి రెయిన్ క్యాప్‌లు విభిన్న మోడళ్లలో లభ్యమవుతున్నాయి. రెయిన్ కోట్‌ల్లో బ్రాండెడ్‌వి రూ.800 నుంచి రూ.5 వేల మధ్య ధరల్లో దొరుకుతున్నాయి. చిన్న పిల్లలకు సంబంధించి రూ.500 నుంచి రూ.2 వేల మధ్య ధరల్లో ఉన్నాయి. అలాగే రెయిన్ క్యాప్‌లకు సంబంధించి తక్కువ ధరల్లో రూ.50 నుంచి ప్రారంభమై రూ.300 వరకు లభ్యమవుతున్నాయి.లోకల్ మేడ్ మెటీరియల్‌కు సంబంధించి దొరికే రెయిన్ కోట్ ధర తక్కువగా ఉంటుంది. రూ.250 నుంచి రూ.800 మధ్య ధరల్లో దొరుకుతున్నాయి. రెయిన్ క్యాప్‌లు రూ.100లోపు లభిస్తున్నాయి. పిల్లలకైతే మరీ తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి.ఏటా వస్తున్న రెయిన్ కోట్లలో చాలా మార్పులు సంతరించుకుంటున్నాయి. ఓ ఏడాది 20 మోడళ్లలో రెయిన్ కోట్‌లు వస్తే మరుసటి ఏడాదికి వాటి సంఖ్య 30 వరకూ పెరుగుతోందని, ధరలు కూడా ఏడాదికేడాది పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. లోకల్ మేడ్ వస్తువులు ఎక్కువగా పూర్ణా మార్కెట్, ఎల్‌ఐసి బిల్డింగ్ వెనుక రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లోని షాపుల్లో దొరుకుతున్నాయి. బ్రాండెడ్ మాత్రం మాల్స్‌లో పెద్ద పెద్ద షాపుల్లో లభ్యమవుతున్నాయి.నగర మార్కెట్లో చూడముచ్చటైన గొడుగులు లభ్యమవుతున్నాయి. కొత్తగా ఫోల్డ్ చేసి ప్యాకెట్లో పెట్టుకునే త్రీఫోల్డ్ గొడుగులు మార్కెట్లోకి వచ్చాయి. చిన్నారులకు బుజ్జిబుజ్జి సైజు గొడుగులొచ్చేశాయి. వీటి ధరలు రూ.130, రూ.180, రూ.220, రూ.280గా ఉన్నాయి. ఈసారి ఎండాకాలం కన్నా వానాకాలం వ్యాపారమే బాగా సాగుతోందని పలువురు చెబుతున్నారు. సరుకును కొల్‌కతా, పంజాబ్, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నరు, బెంగళూరుల నుంచి తెచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు.గత నెల మూడో వారం వరకూ గొడుగుల విక్రయాలు పెద్దగా జరిగేవి కావు. ఇటీవల వాతావరణంలో మార్పులు రావడంతో తరుచూ వర్షాలు పడుతున్నాయి.
Tags:
Andrapradeshnews