కరుణించని వరుణుడు.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కరుణించని వరుణుడు..

కన్నీరు పెడుతున్న పల్లెలే
అదిలాబాద్, జూలై 19, (way2newstv.com)
ఖరీఫ్‌ ప్రారంభంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉండడంతో రైతన్నల మొహంలో ఆనందం కనిపించింది. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలున్నాయని వాతావరణశాఖ అధికారుల సూచనల మేరకు తమ పంటలకేమి డోకా లేదని ధీమాగా ఉన్నారు. జూన్‌ రెండవ వారంలో కొద్దిపాటి వర్షాలు కురియడంతో ఇక వర్షాలు కురియకుండా పోతాయా అని రైతులు తమ పంటపొలాల్లో విత్తనాలు వేసుకున్నారు. పక్షం రోజులు గడుస్తున్న మళ్లీ వర్షం కురియకపోవడంతో మొలకెత్తిన పత్తి, మినుము, సోయా మొలకలు పూర్తిగా ఎండిపోవడంతో రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. మరో వారం రోజుల తర్వాత వర్షం కురియడంతో రెండోసారి విత్తనాలు విత్తుకున్నారు. వారం రోజులుగా వర్షాల జాడ లేకపోవడంతో రెండవ సారి విత్తిన విత్తనాలు మొలకెత్తే దశలో వాడిపోతున్నాయి.
 కరుణించని వరుణుడు....

తానూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి నష్ట పరిహారం అందించి అదుకోవాలని వేడుకుంటున్నారు.జిల్లాలో జూన్‌ రెండవ వారంలో కొద్దిపాటి వర్షాలు కురియడంతో రైతన్నలు మురిసిపోయి పంటలను వేసుకున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు మొలకెత్తగా మరి కొన్ని మండలాల్లో వర్షాలు లేక ఎండిపోయాయి. తానూరు మండలంలోని మొగ్లి, మసల్గా, మసల్గా తండా, బెంబర, బోరిగాం, ఉమ్రి(కే), బెల్‌తరోడా, మహలింగి, బామ్ని, భోసి, బోల్సా, హిప్నెల్లి, ఎల్వి, ఎల్వత్, దాగాం, కళ్యాణి, కుప్టి, వడ్‌గాం, నంద్‌గాం, సింగన్‌గాం, తానూరు, కోలూరు, జౌలా(బి), తొండాల గ్రామాల్లో వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయాయి. పత్తి, సోయా, మినుము, పెసర పంటలు మొలకెత్తె దశలోనే వాడిపోతున్నాయి. మరో రెండు రోజుల్లో వర్షాలు కురియకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు సాయంత్రం సమయంలో మేఘాలు కమ్ముకోవడం, బలమైన గాలులతో వెళ్లిపోవడం పరిపాటిగా మారుతోంది.తానూరు మండలంలో ఈ ఏడాది 17,329 హెక్టార్లలో రైతులు పంటల్ని సాగు చేస్తున్నారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో 6,500 హెక్టర్లలో పత్తి, 7,800 హెక్టర్లలో సోయా, 1200 హెక్టర్లలో మినుము, 16 50 హెక్టర్లలో కంది, 120 హెక్టర్లలో పెసర, 34 హె క్టర్లలో వరి సాగు చేశారు. గత ఏడాది ఖరీఫ్‌ పం టలు తీసే దశలో అధిక వర్షాలు కురియడంతో పంట దిగుబడి రాలేదు. రబీలో వేసిన పంటలపై దిగుబడి పొందుదామనుకుంటే అకాల వర్షం కారణంగా రైతులు అంతగా దిగుబడి పొందలేక పొ యారు. ఈ ఏడాదైన పంటల దిగుబడి పొంది చేసిన అప్పులు తీర్చుదామనుకున్న రైతన్నలకు ని రాశే మిగిల్చింది. రెండవ సారి విత్తనాలు వేయడంతో అప్పులు బాగా పెరిగిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.మూడు రోజలు క్రితం మొగ్లి, మసల్గా, మసల్గా తండా, గ్రామాలకు ఏడీఏ అం జిప్రసాద్, వ్యవసాయ అధికారి గణేష్‌లు