అమరావతి జూలై 16 (way2newstv.com)
స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట మాట్లాడిన టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తమ తరుఫున మాట్లాడే అవకాశం అచ్చెన్నాయుడికి ఇవ్వాలని కోరారు. దీనిని మన్నించిన స్పీకర్ అచ్చెన్నాయుడికి మాట్లాడే అవకాశం కల్పించారు.
ఇదేమైనా బజారనుకుంటున్నారా?: టీడీపీపై స్పీకర్ ఆగ్రహం
అయితే అచ్చెన్న మాట్లాడటానికి ముందే స్పీకర్ సబ్జెక్టును మాత్రమే మాట్లాడి.. త్వరగా క్లోజ్ చేయాలని సూచించారు. అయితే ‘నేను సబ్జెక్టుకే వస్తున్నా.. లేదంటే మీరు రాసివ్వండి నేను చదివేస్తా’ అని స్పీకర్‌కు అచ్చెన్న తెలిపారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్.. ‘‘మీరు చెప్పండి. నేను చదువుతాను ఇక్కడ. ఏం మాట్లాడుతున్నారు? ఇదేమైనా బజారు అనుకుంటున్నారా?’’ అంటూ మండిపడ్డారు.
Tags:
Andrapradeshnews