తిరుమల విఐపీ దర్శనాలపై హైకోర్టులో విచారణ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తిరుమల విఐపీ దర్శనాలపై హైకోర్టులో విచారణ

గురువారానికి వాయిదా
అమరావతి జూలై 15 (way2newstv.com): 
తిరుమల తిరుపతి దేవస్థానం  లో అమలవుతున్న విఐపీ  బ్రేక్ దర్శనాల కేసు పై సోమవారం నాడు హైకోర్టు లో విచారించింది. ఎల్L1,ఎల్ L2, ఎల్ 3 దర్శనాలు పై టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ ను న్యాయస్థానం వివరణ కోరింది. కౌంటర్ లో ఎందుకు  ఎల్ 1,  ఎల్2, ఎల్ 3 దర్శనాలు పై వివరణ ఇవ్వలేదంటూ హైకోర్టు ఆగ్రహం వెలిబుచ్చింది. బ్రేక్ దర్శనలును రద్దు చేస్తామని చైర్మన్ ప్రకటన చేశారని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 
తిరుమల విఐపీ దర్శనాలపై హైకోర్టులో విచారణ

ప్రకటన ను లెక్కలోకి తీసుఓలేమన్నల కోర్టు ఆయా దర్శనాలకు రద్దు చేస్తున్నట్లు జీవో , ఆర్డర్ ఉంటే కోర్ట్ ముందు పెట్టాలని ఆదేశించింది. టీటీడీ బోర్డ్ ఏ ఏర్పాటు కాలేదు.  ఛైర్మన్ నిర్ణయం ఒక్కటే చట్ట ప్రకారం చెల్లదంటూ పిటిషనర్ తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర వాదించారు. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు చేసి  అందులో ఉన్న గుణగణలునే ప్రోటోకాల్ దర్శనాలు పేరుతో పేరు మార్చి టీటీడీ తీసుకొస్తుందని ఉమేష్ చంద్ర  హైకోర్టు తెలిపారు.  విఐపీ దర్శనాలు ఉన్న అంశాలు పూర్తిగా తొలగించాలి. కొత్తగా ఏర్పాటు అయ్యే బోర్డ్ లో కూడా వీటి ప్రతిపాదన లేకుండా చూడాలని అయన న్యాయస్థానాన్ని కోరారు. వాటిని కంటి తుడుపు చర్య గా కాకుండా శాస్వితంగా రద్దు చేయాలని కోరారు. పిటిషనర్ వాదనలు ఏకీభవించిన న్యాయ స్థానం, పూర్తి వివరాలు తో అఫిడవిట్  ధకాలు చేయాలని టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ కి ఆదేశించింది. తదుపరి విచారణ గురువారం కి వాయిదా వేసింది.