పీపీఏలో పై తాడోపేడో... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పీపీఏలో పై తాడోపేడో...

రెడీ అవుతున్న జగన్ 
విజయవాడ, జూలై 16  (way2newstv.com)
విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై ఏపీ సీఎం జగన్‌కు రెండోసారి కేంద్రం లేఖ రాసిన విషయం తెలిసిందే. పీపీఏల పున:సమీక్షపై ఆలోచించాలని కేంద్ర మంత్రి ఆర్‌కేసింగ్‌ లేఖ రాయగా, జగన్ మంత్రి ఈ విషయంలో వెనక్కు తగ్గబోమని అంటున్నారు. కేంద్ర ఇందన శాఖ మంత్రి రాసిన లేఖకు వివరణ ఇస్తామని  అజేయ్‌కల్లం వ్యాఖ్యానించారు అధిక ధరలకు పీపీఏలు కుదుర్చుకోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.2,500 కోట్ల భారం పడుతుందని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒప్పందం పారదర్శకతను తేల్చనున్నామని, గత ఐదేళ్లలో నాటి రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలపై సమీక్షించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని దెబ్బతీస్తున్న అన్ని అంశాలపైనా సమీక్షించి, అక్రమాలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని, లేకపోతే ఇబ్బంది పెట్టబోమని కల్లమ్ పేర్కొన్నారు. 
పీపీఏలో పై తాడోపేడో...

గత ఐదేదేళ్లలో పీపీఏలు ఎక్కువగా జరిగాయని, 3 వేల మెగావాట్ల పవన, సౌర విద్యుత్‌ కోసం ఒక్కో యూనిట్‌కు రూ.4.84 చెల్లించారని అన్నారు. అయితే, 2018-19 నాటి ఆర్థిక సర్వేలో పవన, సౌరవిద్యుత్‌ ధరలు గణనీయంగా తగ్గాయని కేంద్రం పేర్కొందని మాజీ సీఎస్ గుర్తుచేశారు. 2010లో యూనిట్‌ ధర రూ.18 ఉంటే 2018 నాటికి రూ.2.44కు పడిపోయిందని, 2017 నాటికి పవన విద్యుత్‌ యూనిట్‌ సగటు ధర రూ.4.20 నుంచి 2.43కు తగ్గిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పీపీఏ ప్రకారం యూనిట్‌కు రూ.4.84 చెల్లిస్తున్నారని, ఇదే సమయంలో థర్మల్‌, జల విద్యుత్‌ రూ.4.12కే అందుబాటులో ఉందని తెలిపారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్‌ అందుబాటులో ఉంటే రూ.4.84 చెల్లించి పవన విద్యుత్‌ కొనాల్సిన అవసరమేంటి? అని ఆయన ప్రశ్నించారు. దీనికి స్థిర ఛార్జీలు యూనిట్‌కు రూ.1.20 చెల్లించాలని, ఇది కలిపితే యూనిట్‌ ధర రూ.6కు పైగానే చేరుతుందని కల్లమ్ వ్యాఖ్యానించారు. కనీసం టెండర్లు పిలవకుండానే ఒప్పందం చేసుకోవాల్సిన అవసరమేముంది? నిలదీశారు. వినియోగిస్తున్న విద్యుత్‌లో ఐదు శాతం సంప్రదాయేతర ఇంధన విద్యుత్‌ పరిమితిని ఏపీఈఆర్‌సీ నిర్దేశించిందని, ప్రభుత్వం మాత్రం 23.6 శాతం వినియోగిస్తుందని అన్నారు. దీనివల్ల ప్రజలపై భారం పడుతుందని, ధరలు పెంచితే పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. యూనిట్‌ రూ.2.70 వంతున ఎలాంటి పీపీఏ లేకుండా 5వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి పవన విద్యుత్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. దీనిపై నిపుణుల కమిటీతో పాటు మంత్రివర్గ ఉపసంఘం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని అజయ్ కల్లమ్ వివరించారు. రాష్ట్రంలో 70శాతం ఒప్పందాలు 5 సంస్థల చేతుల్లోనే ఉన్నాయని, పవన విద్యుత్‌కు సంబంధించి మొత్తం 221 పీపీఏలున్నాని తెలియజేశారు. వీటిలో ఉమ్మడి ఏపీలో 88, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 133 పీపీఏలు కాగా, వాటి విలువ రూ.39,200 కోట్లు అని అజేయకల్లం పేర్కొన్నారు