కర్ణాటక కాంగ్రెస్ లో సంకీర్ణ సర్కారుకు షాకి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కర్ణాటక కాంగ్రెస్ లో సంకీర్ణ సర్కారుకు షాకి


బెంగళూర్, జూలై 2, (way2newstv.com)
కర్ణాటక సీఎం కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. సంకీర్ణ సర్కారుకు షాకిచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి గట్టి ఎదురుదెబ్బ తగలింది. కుమారస్వామికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, రమేష్ జార్ఖిహోళిలు పార్టీకి రాజీనామా చేశారు. మరో నలుగురు శాసనసభ్యులు ఇదే బాటలో ఉన్నట్లు కన్నడ నాట ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్నారు. కేవలం ఎనిమిది మంది సభ్యులు ఉంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముంది. ఆ దిశగా గత కొద్దిరోజులుగా కమలనాధులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు రాజీనామాతో ఇటు కాంగ్రెస్ లోనూ కలవరం ప్రారంభమయింది.విజయనగర్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది గంటల వ్యవధిలోనే గొకాక్ ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోళి కూడా తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. మంత్రి పదవి దక్కలేదనే కారణంతోనే వీరిద్దరూ పదవులకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. రాజీనామా చేసిన అనంతరం.. ఆనంద్ కుమార్ గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిశారు. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాతో కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బలం 76కు తగ్గింది. జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు బలం 117కి తగ్గింది. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలుండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 113 స్థానాలు అవసరం. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

 కర్ణాటక కాంగ్రెస్ లో సంకీర్ణ సర్కారుకు షాకి

 రమేశ్ రాజీనామా లేఖ అందలేదని అసెంబ్లీ కార్యదర్శి చెప్పడం గమనార్హం. రమేశ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని అనంతరం స్పీకర్ కార్యాలయం ప్రకటించింది. బళ్లారి జిల్లాను విభజించి.. విజయనగర్‌ను జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తు   న్న ఆనంద్ సింగ్.. జిందాల్ స్టీల్ ప్లాంట్‌కు రూ.3667 ఎకరాల భూమి విక్రయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి తనకు సమాధానం వస్తే వెనక్కి తగ్గుతాని సంకేతాలు ఇస్తున్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో కాళభైరవ స్వామి ఆలయానికి శంకుస్థాపన చేయడం కోసం అమెరికా వెళ్లిన కుమారస్వామి.. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తనకు తెలుసని ట్వీట్ చేశారు. ఆపరేషన్ కమలం కారణంగానే వీరిద్దరూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారని వార్తలొస్తున్నాయి. కానీ ఈ వార్తలను అటు ఎమ్మెల్యేలు, ఇటు బీజేపీ కొట్టిపారేసింది. ఈ పరిణామాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం కూలిపోతే నూతన సర్కారును ఏర్పాటు చేసే హక్కు తమకుందని బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందనే అనుమానంతో.. గతంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను బెంగళూరు శివార్లలోని ఓ రిసార్ట్‌లో ఉంచింది. ఈ సమయంలో ఆనంద్ సింగ్‌‌పై కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కంప్లి గణేష్ దాడిచేసి గాయపర్చారు.