ఐదు లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఐదు లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు


న్యూఢిల్లీ,జూలై 4,(way2newstv.com)
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టారు. . సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓంబిర్లా బడ్జెట్ ప్రవేశపెట్టాలని కోరుతూ నిర్మలా సీతారామన్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు రంగాలకు సంబంధించిన కీలక పథకాలను ఆమె ప్రకటించారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామనీ, వాటికి వన్ టైమ్ క్రెడిట్ గ్యారెంటీ ఇస్తున్నామని వెల్లడించారు. మెట్రో రైలు ప్రాజెక్టుల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. 

ఐదు లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు


ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద కొత్తగా 1.97కోట్ల ఇళ్లు కేటాయించినట్లు ఆమె తెలిపారు. 114 రోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని నిర్మల స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.రూ.5లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని నిర్మలాసీతారామన్ చెప్పారు. అలాగే  విద్యుత్ వాహనాలపై జీఎస్టీని 12శాతం నుంచి 5శాతానికి తెచ్చే ఆలోచనలో ఉన్నాం.  పన్నుల విధానంలో  ట్రాన్స్ పరన్సీ తీసుకువస్తామని అన్నారు.  ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా రూ.80,250 కోట్లతో రోడ్ల నిర్మాణం, గ్రామాల కనెక్టివిటీ కోసం 1.25లక్షల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు దేశంలోఇకపై బంగారం ధరలు గణనీయంగా పెరగనున్నాయి. బంగారంపై 10 శాతంనుంచి 12.5 శాతానికి సుంకాన్ని పెంచుతున్నట్లు  నిర్మలా సీతారామన్ ప్రకటించారు.