జీపీఎఫ్ లో తగ్గిన వడ్డీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జీపీఎఫ్ లో తగ్గిన వడ్డీ

న్యూఢిల్లీ, జూలై 16, (way2newstv.com)
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు షాకిచ్చింది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) వడ్డీ రేటును తగ్గించింది. ఇతర ఫండ్స్ వడ్డీ రేట్లలో కూడా కోత విధించింది. ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జూలై-సెప్టెంబర్ కాలానికి సంబంధించి జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌పై సబ్‌స్క్రైబర్లకు 7.9 శాతం వడ్డీ లభిస్తుంది. గత త్రైమాసికంలో జీపీఎఫ్ వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే ఎంప్లాయీస్, డిఫెన్స్ రంగానికి చెందిన ఉద్యోగులకు ఈ రేట్ల తగ్గింపు వర్తిస్తుంది. ప్రస్తుత జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటుకు సమానంగా ఉండటం గమనార్హం. వడ్డీ తగ్గింపు నిర్ణయం జూలై 1 నుంచే అమలులోకి వస్తుందని ఆర్థిక శాఖ తాజాగా ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. సెప్టెంబర్ 30 వరకు కొత్త రేటు అమలులో ఉంటుంది. 
జీపీఎఫ్ లో తగ్గిన వడ్డీ

ఇతర ఫండ్స్.. 
✺ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (సెంట్రల్ సర్వీసెస్) 
✺ కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ 
✺ ఆల్ ఇండియా సర్వీసెసర్ ప్రావిడెంట్ ఫండ్ 
✺ స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్ 
✺ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (డిఫెన్స్ సర్వీసెసర్) 
✺ ఇండియన్ ఆర్డినెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రావిడెంట్ ఫండ్ 
✺ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ వర్క్‌మెన్స్ ప్రావిడెంట్ ఫండ్ 
✺ ఇండియన్ నేవీ డక్‌యార్డ్ వర్క్‌మెన్స్ ప్రావిడెంట్ ఫండ్ 
✺ డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్స్ ప్రావిడెంట్ ఫండ్ 
✺ అర్మ్‌డ్ ఫోర్సెస్ పర్సెనెల్ ప్రావిడెంట్ ఫండ్ 

పైన పేర్కొన్న ఫండ్స్ అన్నింటికీ రేటు కోత వర్తిస్తుంది. ఇకపోతే ప్రభుత్వం చివరగా అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేటును పెంచింది. తర్వాత అప్పటి నుంచి వడ్డీ రేటు స్థిరంగానే ఉంటూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ తగ్గించింది