శ్రీకాకుళం, జూలై 26, (way2newstv.com)
ఫైబర్‌నెట్ డేటా స్పీడ్‌లో ఎటువంటి సందేహం అవసరం లేదు. సగటున 14 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్, 6 ఎంమీపీఎస్ అప్లోడ్ స్పీడ్‌తో లోకల్ కేబుల్ ఆపరేటర్ ద్వారా ఏపీ ఫైబర్ నెట్‌ను పొందవచ్చునంటూ ప్రభుత్వం ప్రకటించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న వారంతా ఎంతో ఆశతో ఎదురుచూసి ఆ సైబర్నెట్ సేవలు కస్టమర్లకు అందించేందుకు జిల్లా అంతటా నాలుగు లక్షల మంది ఆపరేటర్లు ముందుకు వచ్చారు. అయితే ఈ నెట్ కట్..కట్..లతో ఏపీ సర్కార్ ఆశయాలపై నెట్‌వర్క్ నీళ్లు జల్లింది. లోకల్ ఛానల్స్ వచ్చే అవకాశం లేదంటూ ముందుగానే చెప్పిన మాట. కానీ, ఛానల్ మార్చేటప్పుడు ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సి వచ్చేలా నెట్‌వర్క్ మారిపోయింది.
సిక్కోలులో ఫైబర్ కట్
టెక్నికల్‌గా ఏదైనా సమస్య వస్తే ఇంటర్నెట్‌తోపాటు టీవీ ప్రసారాలు కూడా గంటలు, రోజుల తరబడి అంతరాయం ఏర్పడే దుస్థితికి జిల్లాలో ఏపీ సైబర్ నెట్ దిగజారిపోయింది. సెటప్ బాక్స్ స్విచ్ ఆఫ్ చేసి, ఆన్ చేస్తే టీవీ, ఇంటర్నెట్ కనెక్టు కావడానికి గంటల సమయం వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిని పరిష్కరించడానికి 24 గంటలు సెటప్ బాక్స్ ఆన్‌లోనే ఉంచాల్సిన పరిస్థితి. టీవీ ప్రసారాలు ఎప్పటికప్పుడు నెట్‌వర్క్ అవరోధాలతో కట్ అయిపోతున్నాయి. ఇన్ బిల్ట్‌గా అందించిన వైఫై హాట్‌స్పాట్ చాలా సెటప్ బాక్స్‌లలో పనిచేయడం లేదంటూ ఏపీ ఫైబర్‌నెట్ కనెక్టివిటీ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. 24 ఇంచీల టీవీలకే ఛానల్స్ బాగా కన్పించే అవకాశం, 32 ఇంచీల పెద్ద స్క్రీన్ టీవీలో హెచ్‌డీ ఛానల్స్‌కు మాత్రమే ప్రభుత్వం ఛాన్స్ ఇచ్చేలా ఫైబర్‌నెట్ పనిచేస్తోంది. మిగతా సాధారణ ఛానల్స్ అంతగా క్లారిటీ రాకపోవడంతో సిక్కోల్ సైబర్‌నెట్ వినియోగదారులంతా ఆందోళన బాట పట్టారు. దీనికితోడు సాంకేతిక సమస్యలు సృష్టించడం..మళ్లీ ఆ సమస్యలను తాత్కాలికంగా పరిష్కరించడం..ఫైబర్ నెట్‌ను ఎప్పటికప్పుడు కట్ చేస్తుండడం వంటి ప్రభుత్వ అనధికార టెక్నాలిజీతో జిల్లాలో నాలుగు లక్షల మంది ఆపరేటర్లు అల్లాడిపోతున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో భారీ దోపిడీ జరిగింది. శ్రీకాకుళం జిల్లా నుంచి రూ. కోటికి పైగా అక్రమ వసూళ్లకు పాల్పడిన ఒక ఉద్యోగి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలో 40 వేల కనెక్టవిటీ కలిగిన ఫైబర్‌నెట్ సంస్థకు చెందిన ఒక ఉద్యోగి చాలా గ్రామాల్లో ఇన్‌పుట్(పాన్) ఇవ్వకుండా ఉండేందుకు కేబుల్ ఆపరేటర్ల నుంచి కనిష్టంగా రూ.5 నుంచి రూ.25 వేలు వరకూ వసూళ్లు జరిపారు. అసలే అంతంతమాత్రంగా ఉన్న వ్యాపారంతో డబ్బులు ఇచ్చుకోలేని వారుంటే, అక్కడ పోటీగా మరో ఆపరేటర్‌ను నియమిస్తూ వ్యాపారాన్ని దివాలా తీసేలా ప్రోత్సహించిన ఫైబర్‌నెట్ సంస్థ ప్రతినిధిపై వందలాది బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇలా ఆందోళన చెందుతున్న ఆపరేటర్లంతా ఫైబర్‌నెట్ సంస్థ ప్రతినిధి అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు అప్పులు చేసుకునే పరిస్థితి ఆపరేటర్లకు ఏర్పడింది. కానీ, చాలాచోట్ల ఇటువంటి వసూలుచేసి కూడా ఇన్‌పుట్ ఇచ్చి మోసాలకు తెర లేపడంతో అసలు సైబర్‌నెట్ సంస్థపై అధికారం ఎవరిది అన్న విషయం తెలియని చాలామంది ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక దీన్ని కొన్నాళ్లుగా వదిలేశారు. 2017లో ప్రారంభమైన ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. రూ. 149కే కేబుల్ ప్రసారాలతోపాటు ఇంటర్నెట్, ఫోన్ సదుపాయం కూడా ఇస్తామని ప్రభుత్వం బాగానే ప్రచారం చేసింది. నాణ్యమైన ప్రసారాలు అందుబాటులో ఉండటంతో దీనివైపు చాలామంది వినియోగదారులు మొగ్గుచూపారు. అయితే, జిల్లాలో నాలుగు లక్షల కనెక్షన్లు అవసరం ఉన్నప్పటికీ ఆ సంస్థ ప్రతినిధి అక్రమ వసూళ్ల కారణంగా ఇప్పటికీ లక్షలాది మంది ఈ ప్రసారాలకు దూరమయ్యారు. మొదటి నుంచి ఈ వ్యవస్థ వ్యతిరేకిస్తూ వచ్చిన కేబుల్ ఆపరేటర్లు సైతం అడిగినంతా ఇచ్చుకుంటూ వెళ్లడంతో మరింత అత్యాశతో ఫైబర్‌నెట్ సంస్థ ఉద్యోగి చేసిన వసూళ్ల విషయం ఆలస్యంగా బయటపడింది. విశాఖలోని ప్రాంతీయ కార్యాలయానికి వరుస ఫిర్యాదులు వెళ్ళడంతో ఆ ఉద్యోగి విధుల నుంచి తప్పించారు. అప్పటికే రూ. కోట్లు వసూలుచేసిన అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవలే అతన్ని విశాఖపట్నం బదిలీ చేశారు. ఇది జిల్లాలో లక్షలాది మంది కేబుల్ ఆపరేటర్లను మరింత ఆగ్రహాన్ని తెప్పించి ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ నివాస్ దృష్టికి తీసుకువెళ్ళారు. సోమవారం స్పందనలో కూడా ప్రభుత్వ ఫైబర్‌నెట్ అవకతవకలపై ఫిర్యాదు చేసేందుకు జిల్లాలోని ఆపరేటర్లంతా ర్యాలీగా వెళ్ళేందుకు సంసిద్ధం అవుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కేబుల్ ఆపరేటర్‌కు ఇన్‌పుట్ కనెక్షన్ ఇచ్చేందుకు రూ. 5 వేలు తర్వాత పాన్ (వంద కనెక్షన్‌లు) ఇచ్చేందుకు అవసరమయ్యే బాక్స్‌కు రూ. 5 వేలు, ఒక ఆపరేటర్ పరిధిలో మరో ఆపరేటర్‌ను నియమించకుండా ఉండేందుకు రూ. 5 వేలు, సెట్ టాప్ బాక్సులకు కృత్రిమ కొరత సృష్టించి బాక్సులు ఇచ్చేందుకు మరికొంత ఇలా ప్రతీ దశలోనూ అక్రమ వసూళ్లు జరిపేరన్న వివరాలన్నీ కలెక్టర్ ముందు ఉంచేందుకు ఆపరేటర్లు ఆధారాలతోపాటు స్పందనలో ఫిర్యాదు చేయనున్నారు.
Tags:
telangananews