ఆచితూచి జగన్ అడుగులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆచితూచి జగన్ అడుగులు

విశాఖపట్టణం, జూలై 30, (way2newstv.com
వై.ఎస్. జగన్ టికెట్ల పంపిణీ నుంచి మంత్రి వర్గ కూర్పు వరకూ తనదైన మార్క్ చూపించారు. ఇక నామినేటెడ్ పదవల భర్తీలోనూ ఆయన అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలతో పాటు, మహిళలు, నిజాయతీ పరులను వై.ఎస్. జగన్ ఎంపిక చేస్తూ వస్తున్నారు. దాని వల్ల అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి మేలు జరిగేలా చూసుకుంటున్నారు. విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ గా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ద్రోణంరాజు శ్రీనివాస్ ని ఎంపిక చేసిన వై.ఎస్. జగన్ అతి ప్రతిష్టాత్మకమైన మహా విశాఖ నగర పాలక సంస్థ  మేయర్ పదవికి కూడా కొత్త పేరుని తెర మీదకు తెస్తారని అంటున్నారు.

ఆచితూచి జగన్ అడుగులు
తాజా ఎన్నికల్లో చివరి నిముషంలో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మెజారిటీని ఏకంగా ఇరవై వేలకు తగ్గించిన అక్రమాని విజయనిర్మలను విశాఖ మేయర్ పదవికి అభ్యర్ధిగా వై.ఎస్. జగన్ ఎంపిక చేస్తారని అంటున్నారు. ఆమెకు భీమునిపట్నం మునిసిపాలిటీ చైర్ పర్సన్ గా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే విద్యాధికురాలు, నిబద్ధత కలిగిన నాయకురాలు కావడంతో పాటు, సామాజికవర్గ పరంగా కూడా కలసి వస్తుందని వై.ఎస్. జగన్ అంచనా వేస్తున్నారుట. అక్రమాని విజయనిర్మల బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆమె భర్త యాదవ సామాజిక వర్గం. విశాఖ అర్బన్ జిల్లా పరిధిలో ఈ రెండు కులాలు మెజారిటీ సంఖ్యలో ఉన్నాయి. దాంతో పాటు మహిళగా విజయనిర్మలను బరిలోకి దింపితే మరింత ప్రయోజనం ఉంటుందని వై.ఎస్. జగన్ అనుకుంటున్నారుట.మేయర్ పదవి కోసం వైసీపీలో ఇపుడు గట్టి పోటీ ఉంది, తూర్పు అసెంబ్లీ సీటు నుంచి తాజా ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న నగర అధ్యక్షుడు వంశ్రీ క్రిష్ణ శ్రీనివాస్ కు మేయర్ టికెట్ ఇస్తామని అప్పట్లో వై.ఎస్. జగన్ హామీ ఇచ్చారు. దాంతో ఆయన ఆశలు పెంచుకున్నారు. అలాగే విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అర్బన్ జిల్లా అధ్యక్షుడు మళ్ళ విజయప్రసాద్ కూడా రేసులో ఉన్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్ కూడా మేయర్ కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నారు. ఇక మరికొంతమంది కూడా మేయర్ కావాలనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వై.ఎస్. జగన్ కొత్త ప్రయోగం చేస్తే వీరి ఆశలకు చెక్ పడుతుంది. అదే సమయంలో విజయనిర్మల మంచి అభ్యర్ధిగా ఉంటారని కూడా పార్టీలో వినిపిస్తున్న మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో.