క్రీడాభిమానుల‌కు క్రీడ‌లు మ‌రింత చేరువ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

క్రీడాభిమానుల‌కు క్రీడ‌లు మ‌రింత చేరువ

రాష్ట్ర క్రీడ‌ల శాఖా మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్
హైద‌రాబాద్‌, జూలై 15(way2newstv.com)
టెన్‌పిన్ బౌలింగ్, బౌలింగ్‌కు ప‌ర్యాయ‌ప‌దంగా మారి క్రీడాభిమానుల‌ను గొప్ప ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో  ఆద‌రిస్తోంది. తెలంగాణ‌లో ఉన్న టెన్‌పిన్ బౌలింగ్ పట్ల అభిమానం క‌లిగి ఉన్న క్రీడాభిమానుల‌కు మ‌రింత చేరువ అయ్యేలా మ‌రియు టెన్‌పిన్ బౌలింగ్ అసోసియేష‌న్ తెలంగాణ విభాగం కృషి చేస్తోంది. హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌య‌త్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప‌లువురు అతిథుల స‌మ‌క్షంలో టెన్‌పిన్ బౌలింగ్ అసోసియేష‌న్ తెలంగాణ విభాగం ప్ర‌క‌టించారు. 
క్రీడాభిమానుల‌కు క్రీడ‌లు మ‌రింత చేరువ 

తెలంగాణ రాష్ట్ర క్రీడ‌ల శాఖా మంత్రి వి.శ్రీ‌నివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ముఖ్య కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం, , స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మ‌న్ వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మ‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఎ.దిన‌క‌ర్ బాబు ఐఏఎస్, టెన్‌పిన్ బౌలింగ్ అసోసియేష‌న్ (ఇండియా) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య కృష్ణ దాస‌రి పాల్గొన్నారు.టెన్‌పిన్ బౌలింగ్ అసోసియేష‌న్ (తెలంగాణ‌) అధ్య‌క్షులు రాహుల్ రెడ్డి ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, టెన్‌పిన్ బౌలింగ్ అసోసియేష‌న్ క్రీడాభిమానుల‌కు క్రీడ‌లు మ‌రింత చేరువ చేసే ల‌క్ష్యంతో ఏర్ప‌డిందని, రాష్ట్ర స్థాయిలో వివిధ ర‌కాలైన టోర్న‌మెంట్‌ల నిర్వ‌హ‌ణ మ‌రియు క్రీడాకారుల‌కు జాతీయ స్థాయిలో అవ‌కాశాలు త‌ద్వారా అంత‌ర్జాతీయ ప్లాట్‌ఫాం వ‌ద్ద‌కు చేరువ చేసేందుకు అసోసియేష‌న్ కృషి చేస్తోందని తెలిపారు.``తెలంగాణ రాష్ట్రంలోని బౌల‌ర్ల‌లో గ‌ల నైపుణ్య‌వంతుల‌ను బ‌లోపేతం చేసి వారిలో పోటీ త‌త్వాన్ని పెంపొందిచి ఉత్త‌మ‌మైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు టీబీఏ (తెలంగాణ‌) లక్ష్యం అన్నారు. బౌల‌ర్ల యొక్క సామ‌ర్థ్యం జాతీయ స్థాయిలో మ‌రియు అంత‌ర్జాతీయ స్థాయిలో పోటీ ప‌డేందుకు త‌గిన‌ మెరుగులు దిద్దుకునేలా అసోసియేష‌న్ ప్రోత్సాహం అందించ‌నుంది. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు టెన్‌పిన్ బౌలింగ్‌ను రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు చేరువ అయేందుకు విస్తృత కృషి చేయ‌డం ల‌క్ష్యంగా టీబీఏ కృషి చేస్తోంది. తెలంగాణ బౌలింగ్ ఫెడ‌రేష‌న్ ఇండియా (టీఎఫ్‌బీఐ)తో అనుబంధంగా మేం ప‌నిచేస్తున్నాం. ఉత్త‌మ‌మైన మౌలిక స‌దుపాయాలు క‌ల్పించి క్రీడాకారులు త‌మ క్రీడ‌ల్లో అత్యుత్త‌మ స్థాయికి ఎదిగేందుకు మా అసోసియేష‌న్ కృషి చేస్తోంది`` అని వెల్ల‌డించారు.