జీహెచ్ఎంసి పారిశుధ్య కార్మికుల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలోని పారిశుధ్య కార్మికులకు నేడు సికింద్రాబాద్ హరిహరకళాభవన్‌లో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కమిషనర్ ప్రారంభించారు.
పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత
సికింద్రాబాద్‌లోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కిమ్స్‌కి చెందిన ప్రముఖ వైద్యులచే నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవం సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతకు అహర్నిషలు కృషిచేసే పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నగరంలోని సూపర్ స్పెషాలిటి ఆసుపత్రుల వైద్యులచే ఉచిత వైద్య పరీక్షలు నిరంతరం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రఘుప్రసాద్, డిప్యూటి కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
Tags:
telangananews