ఇస్మార్ట్ శంకర్ నాదే : హీరో ఆకాశ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇస్మార్ట్ శంకర్ నాదే : హీరో ఆకాశ్

హైద్రాబాద్, జూలై 24  (way2newstv.com):
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ కథ నాదే అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు ‘ఆనందం’ ఫేమ్ హీరో ఆకాశ్. ఇంతకీ మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? అంటే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికే తమిళ ప్రొడ్యుసర్ కౌన్సిల్‌లో ఇస్మార్ట్ శంకర్ సినిమాపై ఫిర్యాదు చేశానంటున్నారు హీరో ఆకాశ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘2016 మే 6 న తాను కథ రాసి.. హీరోగా నటించిన తమిళ చిత్రం ‘నాన్ యార్’కు అక్కడ మంచి ఆదరణ లభించింది. 
ఇస్మార్ట్ శంకర్ నాదే : హీరో ఆకాశ్

తెలుగులో 'కొత్తగా ఉన్నాడు' అనే పేరుతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తాము పెద్ద షాక్ తగిలింది. నేను రాసిన కథ.. ఇస్మార్ట్ శంకర్ కథ సేమ్ టు సేమ్. ఆ కథను కాపీ కొట్టి పూరీ జగన్నాథ్ సినిమా తీసేశారు. అయితే పూరీ జగన్నాథ్ తీసిన ‘ఇస్మార్ట్ శంకర్’ కథకు మూలం ‘ఐబో’ ఇంగ్లీష్ సినిమా అని చెబుతున్నారు.. ఆ సినిమా 2017లో విడుదలైంది నేను తీసిన ‘నాన్ యార్’ సినిమా ఇంగ్లీష్‌లో ‘మిస్టరీ’ పేరుతో 2016లోనే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు నేను తాగి మాట్లాడటం లేదు.. తాగకుండానే మాట్లాడుతున్నా. నేను నా రీఎంట్రీ కోసం కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్.. ఈ ‘కొత్తగా ఉన్నాడు’. నేను ఇప్పుడు మీడియాకి రావడానికి ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ అయ్యిందని కాదు.. ఇప్పుడు నేను కొత్తగా ఉన్నాడు సినిమా రిలీజ్ చేస్తే.. మీరే చెప్తారు.. ఆకాష్‌కి బుద్ధిలేదా.. ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్ ఇదే కథతో వచ్చింది మళ్లీ అదే కథతో ఈ ‘కొత్తగా ఉన్నాడు’ ఏంటి? అని. నేను పూరీ మీదే కాదు.. ఐబో సినిమా వాళ్లపై కూడా కంప్లైంట్ చేస్తా. అందుకే లండన్ వెళ్తున్నా’ అంటూ దర్శకుడు పూరీపైన, ఇండస్ట్రీపైన ఫైర్ అయ్యారు ఆకాశ్.