ఏందప్పా... చినరాజప్పా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏందప్పా... చినరాజప్పా

కాకినాడ, జూలై 27, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన చిన రాజప్ప యాక్టివ్ గా లేరా? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హోంమంత్రిగా కొనసాగిన చినరాజప్ప అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం పెదవి విప్పడం లేదు. చినరాజప్ప ఎందుకు మాట్లాడటం లేదు. ఆయనలో అసంతృప్తి ఉందా? లేక మరైదైనా కారణమా? హోంమంత్రిగా పనిచేసిన చినరాజప్ప శాసనసభ సమావేశాల్లో మాట్లాడక పోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.చినరాజప్ప…. తెలుగుదేశం పార్టీకి…చంద్రబాబుకు నమ్మకమైన నేత. ఎంతగా అంటే చంద్రబాబు చెబితే ఏదైనా చేస్తారు. గతంలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన చినరాజప్ప 2014 ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
ఏందప్పా... చినరాజప్పా

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో చినరాజప్ప నక్కను తొక్కారు. చంద్రబాబు చినరాజప్పను ఏకంగా ఉప ముఖ్యమంత్రిని చేశారు. అంతేకాదు ఆయనకు కీలకమైన హోంమంత్రి పదవిని కట్టబెట్టారు.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చినరాజప్ప టీడీపీ గొంతుకగా మారారు. ప్రధానంగా కాపు రిజర్వేషన్లపై ముద్రగడ ఉద్యమం చేస్తున్న సయమంలో ఆయన చెలరేగిపోయారు. ఇక జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కత్తితో దాడి జరిగినప్పుడు కూడా చినరాజప్ప హోంమంత్రిగా చిందులు తొక్కారు. ఇక ప్రతి విషయంలోనూ చినరాజప్ప టీడీపీ తరుపున తన గొంతుకను బలంగా విన్పించేవారు.కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చినరాజప్ప గొంతు మూగబోయింది. ఆయన ఈ బడ్జెట్ సమావేశాల్లో అసలు నోరు మెదపలేదు. అయితే ఇందుకు కారణాలు కూడా లేకపోలేదంటున్నారు. చినరాజప్పకు సహజంగా మాట్లాడే స్వభావం తక్కువని టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. ఆయన పెద్దగా మాట్లాడలేరు. ప్రచార సభల్లోనూ చినరాజప్ప తక్కువగానే మాట్లాడతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చంద్రబాబు వీర విధేయుడైన చినరాజప్ప అసెంబ్లీలో గొంతు విప్పకపోవడానికి మరే కారణం లేదంటున్నారు. అంతకు మించి ఏమీ లేదట.