గ్రామ సచివాలయాలకు ఏర్పాట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గ్రామ సచివాలయాలకు ఏర్పాట్లు

ఎలూరు, జూలై 23 (way2newstv.com)
పశ్చిమగోదావరిజిల్లాలో త్వరలో ఏర్పాటుచేయనున్న 931 గ్రామ సచివాలయాలకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్  ఎం వేణుగోపాల్ రెడ్ది చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి 4 వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాల్సివుందని అందుకు ప్రణాళికను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్ది ఆశయాలకు అనుగుణంగా అక్టోబర్ 2వ తేది నుండి సచివాలయ వ్యవస్థను ప్రారంబించెందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఒక్కొక్క గ్రామసచివాలయానికి 11 మంది ఉద్యోగులను నియమించడం జరుగుతుందన్నారు. 
 గ్రామ సచివాలయాలకు ఏర్పాట్లు

జిల్లాలో సుమారు ఒక లక్ష 50 వేలమంది అభ్యర్థులు ధరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని అందుకు అనుగుణంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొన్ని ఉద్యోగాలకు ఉదయం జనరల్ నాలెజ్జ్ పై పరీక్ష ఉంటుందని, మరికొన్ని ఉద్యోగాలకు సాయంత్రం టెక్నికల్ నాలెజ్జ్ పై పరీక్ష ఉంటుందని చెప్పారు. ఉదయం సుమారు ఒక లక్షమంది, సాయంత్రం 50 వేల మంది పరీక్షలకు హాజరవుతారని భావిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ చెప్పారు. అందు నిమిత్తం మండల స్థాయిలో వున్న పరీక్షా కేంద్రాలను గుర్తించాలని జిల్లా విద్యాశాఖాధికారి, ఆఐఒ, డివిఇఒ అధికారులను ఆదేశించారు. ఎలిమెంటరి పాఠశాలలు మినహా ఉన్నతపాఠశాలలు, బిఇడి, ఇంటర్, డిగ్రి కాలేజిలతోపాటు ఇంజనీరింగ్ కాలేజిలను గుర్తించి ఒక ప్రొఫార్మాలో నివేదిక సమర్పించాలని జాయింట్ కలెక్ట ర్ ఆదేశించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను చేసేందుకు ఎంఇఒ, ఎండిఒ, తాహసిల్దార్ లు ఒక టీమ్ గా ఏర్పడి పరీక్షా కేంద్రాల లో అభ్యర్థులు పరీక్షలు వ్రాసేందుకు అవసరమైన సౌకర్యాలు ఉన్నదిలేనిదీ, పరిశీలించాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా భవనాలు పాడై శ్లాబులు లీకేజిలు వున్న భవనాలను పరీక్షా కేంద్రాలకు అనుమతించేది లేదని చిన్నచిన్న రిపేర్లు అవసరమైతే వెంటనే చేయించి ప్రమాదం లేదని భావిస్తేనే వాటిని పరీక్షా కేంద్రాలుగా అమమతిస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, విధ్యుత్, బెంచీలు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు ఏర్పాటుచేసి అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందిలేకుండా చూడాలన్నారు. ఈనెల 26వ తేది సాయంత్రం 5 గంటల నుండి 6 గంటలవరకు కలెక్టర్, జెసి, సిఇఒ, డిఇఒ, డిపిఒ ఇతర అధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్వివేది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని, అధికారులు ఏర్పాట్ల వివరాలతో సిద్దంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో జడ్పి సిఇఒ  వి .నాగార్జునసాగర్, డిపిఒ  విక్టర్, డిఇఒ  సివి రేణుక, డిపిఆర్సి రీసోర్స్పర్శన్  రాఘవన్, డివిఇఒ  ఎం మునీశ్వరరావు, ఆర్ఐఒ  బి .ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.