కొండంత బకాయిలు (శ్రీకాకుళం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొండంత బకాయిలు (శ్రీకాకుళం)

శ్రీకాకుళం, జూలై 2 (way2newstv.com): 
ఉపాధి హామీ పథకంలో భాగంగా మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద చేపట్టిన పనులకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు అప్‌లోడ్‌ చేసిన మేరకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 165.78 కోట్లు. ఈ బకాయిలు నెలనెలా పెరిగిపోతున్నాయి. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి విడుదలయ్యే నిధులు ఆరేడు నెలలు దాటినా విడుదల కాకపోవడం అధికార వర్గాలను ఇబ్బందుల్లోకి నెడుతోంది. జిల్లాలో మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద చేపట్టిన పనులకు సంబంధించి గతేడాది నవంబరు ఆఖరులో వచ్చిన నిధులు తప్ఫ. ఆ తరువాత ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనుల్లో మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద ఎప్పటికప్పుడు నిధులను పొందుతున్న జిల్లాకు బకాయిలు అశనిపాతంగా మారుతున్నాయి. ఉపాధిహామీ కూలీలకు రూ. వంద వెచ్చిస్తే.. ఆ వెంటనే మరో రూ. 67 వరకు మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద నిధులు అదనంగా వస్తాయి. 
కొండంత  బకాయిలు (శ్రీకాకుళం)


ఈ నిధులతో గ్రామాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. అంగన్‌వాడీ, పంచాయతీ, మహిళా సంఘాల భవనాల నిర్మాణాలతో పాటు.. విద్యాలయాలకు ప్రహరీల నిర్మాణాలు చేపట్టారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గోశాలలు, మినీ గోశాలలు.. మేకలు, గొర్రెల షెడ్లు.. ఇంకా గృహాలు నిర్మించుకునే వారికి అవసరమయ్యే కూలీల పనులకు ఉపాధిహామీ పథకంలో భాగంగానే చెల్లింపులు చేస్తుంటారు. ఆర్నెల్ల కిందట ఉపాధి హామీ నిధులు మొత్తానికే నిలిపివేయడంతో.. కూలీలకు చెల్లింపుల్లో సైతం ఇబ్బందులు తలెత్తాయి. ఆ తరవాత కూలీల వరకు ఇబ్బంది లేకుండా చేసినప్పటికీ.. మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద చేపట్టిన పనులకు మాత్రం నిధుల విడుదలకు ఆటంకాలు తలెత్తుతున్నాయి.ఉపాధి హామీ మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో విరివిగా సిమెంటు రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులను చేపట్టింది. వీటితో పాటు గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ, మహిళా సమాఖ్య భవనాల పర్యవేక్షణ బాధ్యతలను కూడా పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీర్లే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో.. 25 శాతానికి మించి చేయని పనులను ఇప్పటికే నిలిపేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అంతకు మించి చేసిన పనులనే కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోనే చెల్లించాల్సిన బకాయిలు అధికంగా ఉన్నట్లు అధికారులు విశదీకరిస్తున్నారు. మార్చి నాటికే ఈ శాఖ చేపట్టిన పనులకు సంబంధించి రూ. 80 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు మరో రూ. 8 కోట్ల విలువైన పనులను చేసి.. బిల్లులను అప్‌లోడ్‌ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.బకాయిలతో ఇళ్ల నిర్మాణాలపైనా ప్రత్యక్ష ప్రభావం పడుతోంది. ప్రభుత్వం వివిధ పథకాల కింద మంజూరు చేసిన ఇళ్లకు.. ఉపాధి హామీ పథకం కింద ఆర్థికంగా చేయూతనిస్తోంది. ఇంటికి పునాదుల నిర్మాణాలకు ఉపయోగించుకునేందుకు వీలుగా 90 రోజుల వేతనాలు చెల్లిస్తోంది. రోజుకు రూ. 205 చొప్పున కూలీ లెక్క కట్టి.. ఒక్కో ఇంటికి రూ. 18,450 వరకు మొత్తాన్ని అందిస్తోంది. పునాదుల నిర్మాణాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు గృహనిర్మాణ సంస్థ లబ్ధిదారుల పేర్లను కంప్యూటరీకరించి.. వారి పేర్లతో బిల్లులను అప్‌లోడ్‌ చేస్తోంది. దీంతో పాటు మరుగుదొడ్డి నిర్మాణానికి మరో రూ. 15 వేలు విడుదల చేస్తుంటుంది. ఇంటి నిర్మాణం పూర్తి కాగానే.. మరుగుదొడ్డికి సంబంధించిన బిల్లులనూ అప్‌లోడ్‌ చేస్తుంది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఇలాంటి బిల్లులు రూ. 8 కోట్ల వరకు ఉంటాయని అంచనా. సత్వరమే ఈ సొమ్ములు సర్దుబాటు చేయకపోతే ఇళ్ల నిర్మాణాలపై పెను ప్రభావం పడుతుందనేది గృహనిర్మాణ సంస్థ అధికారుల ఆందోళన.ప్రభుత్వం గోశాలలు, మినీ గోశాలలు, గొర్రెలు- మేకల షెడ్ల నిర్మాణాల బాధ్యతలను పశుసంవర్ధక శాఖకు అప్పగించింది. ఒక్కో గోశాలకు రూ. 21 లక్షల చొప్పున ఉపాధిహామీ పథకం మెటీరియల్‌ కాంపొనెంట్‌ నుంచి మంజూరు చేసింది. గ్రామంలో ప్రభుత్వ భూమిలో సుమారు 20 సెంట్ల విస్తీర్ణంలో నిర్మించుకోడానికి వీలుగా జిల్లా వ్యాప్తంగా 31 గోశాలలను మంజూరు చేసింది. ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ గోశాలల్లో గ్రామంలోని రైతులందరూ తమ పశువులకు ఆవాసాలుగా వినియోగించుకోవచ్ఛు రణస్థలం మండలం రావాడ, రాజాం మండలం పొగిరి గ్రామాల్లో చేపట్టిన గోశాలల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇవి కాకుండా రైతులు వ్యక్తిగతంగా మినీ గోశాలలు నిర్మించుకోడానికి వెసులుబాటు కల్పించింది. ఒక సెంటు స్థలం ఉంటే ఏ రైతు అయినా మినీ గోశాలలను నిర్మించుకోవచ్ఛు ఎవరి ఇంటి ముందు వారే నిర్మించుకోవచ్ఛు రైతు తన వాటాగా రూ. 10 వేలు జమ చేయాల్సి ఉంటుంది. మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద ప్రభుత్వం ఆ రైతు ఖాతాలో రూ. 90 వేలు జమ చేస్తుంది. రూ. లక్షతో నిర్మాణాన్ని చేపట్టుకోవచ్ఛు అంచెలంచెలుగా నిర్మాణ దశలను బట్టి అయిదు సార్లు సొమ్ములు జమ చేస్తుంది. జిల్లాలో మొత్తం 10,330 మినీ గోశాలలను మంజూరు చేసింది. వీటిలో 6,700 మినీ గోశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. గొర్రెలు- మేకల షెడ్ల నిర్మాణాల్లో ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయి. రైతుల ఖాతాల్లో మాత్రం సొమ్ములు జమ కాలేదు. డిసెంబరు నుంచి దాదాపు రూ. 12 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా పలు చోట్ల రైతులు నిర్మాణాలను మధ్యలోనే వదిలేస్తున్నట్లు ఆ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.