రిషిత్ కథా సుఖాంతం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రిషిత్ కథా సుఖాంతం

రాజమండ్రి, జూలై 25,(way2newstv.com)
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నాలుగేళ్ల బాలుడు జషిత్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అనపర్తి మండలం కుతుకులూరు రోడ్ వద్ద గురువారం బాలుడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనస్థితిలో ఉన్న బాలుడిని పరామర్శించిన పోలీసులు అతడు మండపేటలో కిడ్నాప్‌కు గురైన జషిత్ అని నిర్ధారించుకుని మండపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాను ఇంటి వద్ద ఆడుకుంటుండగా కిడ్నాపర్లు ఎత్తుకెళ్లాడని వచ్చీరానీ మాటలతో జషిత్ చెబుతుండటం అందరినీ ఆవేదనకు గురిచేసింది. 
రిషిత్ కథా సుఖాంతం

మూడురోజుల నుంచి తమ బిడ్డ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు జషిత్ క్షేమంగా తిరిగి రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలుపుతున్నారు. బాలుడిని కిడ్నాపర్లు ఎత్తుకెళ్లారన్న విషయం తెలియగానే కుటుంబసభ్యులతో పాటు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మీడియాలో విస్తృతంగా కథనాలు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. జషిత్ క్షేమంగా రావాలంటూ సోషల్‌మీడియాలోనూ విపరీతంగా పోస్టులు చేస్తున్నారు. అందరి ప్రార్థనలు ఫలించి బాలుడు క్షేమంగా వారి చెర నుంచి బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలతో  తనిఖీలు చేపట్టడంతో కిడ్నాపర్లు వదిలిపెట్టివెళ్లిపోయారు.