అమ్మకు ఆపద (తూర్పుగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమ్మకు ఆపద (తూర్పుగోదావరి)

కాకినాడ, జూలై 5 (way2newstv.com):
 జిల్లాలోని గర్భిణులు రక్తహీనత సమస్యతో సతమతమవుతున్నారు.. ఈ విషయాన్ని ప్రధానమంత్రి సురక్షిత్‌ మాతృత్వ యోజన (పీఎంఎస్‌ఎంవై) ఆరోగ్య పరీక్షల ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి.. ఈ సమస్యను అధిగమించడానికి అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నా ఫలితాలు అంతంతమాత్రంగా ఉండడం శోచనీయం. గర్భిణుల్లో పౌష్టికాహార లోపాల్ని తగ్గించి.. రక్తహీనత సమస్యను దూరం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. ప్రభుత్వం ప్రతినెలా రూ. 
అమ్మకు ఆపద (తూర్పుగోదావరి)


కోట్ల నిధులు ఖర్చు చేసి.. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నా పెద్దగా ఫలితాలు కనిపించడం లేదు. ప్రధాన మంత్రి సురక్షిత్‌ మాతృత్వ యోజన(పీఎంఎస్‌ఎంవై) కింద ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకు జిల్లాలోని ప్రాథమిక, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రుల్లో 14,111 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో 4,178 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. రక్తహీనత తరువాత అధిక రక్తపోటు సమస్య వారిని బాధిస్తోంది. బాల్యంలోనే వివాహాలు చేయడం వంటి లోపాలు అధికంగా ఉన్నాయి. ఈ సమస్యల కారణంగా ప్రసవం సమయంలో వారికి తీవ్ర అనారోగ్య పరిస్థితులు తలెత్తుతున్నాయి. వీరికి వైద్యం చేయడానికి సరైన సౌకర్యాలు లేవని పీహెచ్‌సీల్లోని వైద్యులు దగ్గరలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి పంపుతున్నారు. అక్కడ మత్తు, గైనిక్‌, చిన్నపిల్లల వైద్య నిపుణుల కొరత కారణంగా తిరిగి ప్రాంతీయ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అక్కడ కూడా ఏదో ఒక సమస్యతో జీజీహెచ్‌, రాజమహేంద్రవరంలోని జిల్లా ఆసుపత్రికి ..మిగతా 7లోతరలిస్తున్నారు. ఈ భారం అంతా పెద్దాసుపత్రులపై పడుతోంది.జిల్లాలో 37,306 మంది గర్భిణులుండగా వీరికి అంగన్‌వాడీ కేంద్రాల నుంచి గుడ్డుపాలు, భోజనం పెట్టడానికి ఒక్కొక్కరికి నెలకు రూ. 375, ఖర్జురం, వేరుసెనగ అచ్చుల కోసం నెలకు రూ. 400 చొప్పున ఖర్చు చేస్తున్నారు. మొత్తంగా రూ. 2,89,12,150 వ్యయం చేస్తున్నారు. ఇంత చేసినా... పూర్తిస్థాయిలో ప్రయోజనం లేకుండా పోతోంది. ఇవి కాకుండా గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవించే వరకూ రక్తాన్ని వృద్ధిచేసే ఐరన్‌ మాత్రలు వైద్యఆరోగ్య శాఖ నుంచి పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా 9న పరీక్షలు చేసి పరిస్థితి మెరుగు పరచుకోవాలని సూచిస్తున్నారు. ఇంత చేసినా చాలామందిలో రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం ఆరు పాయింట్లు దాటి ఉండడం లేదు. గర్భిణులకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రసవించాలంటే కనీసం 12పాయింట్లు పైన ఉండాలి. కానీ అలా ఉండే వారి సంఖ్య 25శాతం దాటడం లేదని వైద్యులు చెబుతున్నారు.జిల్లాలోని రామచంద్రపురం ప్రాతీయ ఆసుపత్రి పరిధిలో ఎక్కువ శాతం రక్తహీనత కేసులు నమోదవుతున్నాయి. జనవరిలో నిర్వహించిన వైద్యపరీక్షల్లో జనవరిలో 196 ఫిబ్రవరిలో 201, మార్చిలో 35, ఏప్రిల్‌లో 317, మే నెలలో 202 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. జనవరి నుంచి మే నెల వరకూ ఈ ఆసుపత్రి నుంచి రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రికి 115 మంది గర్భిణులను రిఫర్‌ చేయగా 34 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు కడియం సామాజిక ఆరోగ్యకేంద్రంలో జనవరిలో 118, ఫిబ్రవరిలో 110, మార్చిలో 101, ఏప్రిల్‌లో 54 మంది.. మేలో 100 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు వైద్యపరీక్షల్లో గుర్తించారు. ఇక్కడ నుంచి అయిదు నెలల్లో 48 మందిని రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రికి తరలించగా 48 మందిని కాకినాడ జీజీహెచ్‌కు పంపారు. ఇలాంటి పరిస్థితి దాదాపు అన్ని ఆసుపత్రుల్లోనూ ఉంది.