లీగ్ దాటి సెమిసీ అడుగులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

లీగ్ దాటి సెమిసీ అడుగులు

న్యూఢిల్లీ, జూలై 4, (way2newstv.com)
వరల్డ్ కప్ 2019 టోర్నీ చివరిదశకు చేరుకుంది. అందరూ ఊహించినట్టే.. అగ్రశ్రేణి జట్లే సెమీస్ కు చేరాయి. అద్భుతాల్ని ఊహించినా ఎక్కడా చాన్స్ రాలేదు. సాదాసీదాగా మొదలైన ప్రపంచకప్ వరుణుడు విలన్ లా మారండంతో ప్రారంభంలో టోర్నీ ఆసక్తి కలిగించలేదు. వరుణుడు పదకొండో జట్టుగా టోర్నీలో ఆడుతున్నాడంటూ క్రికెట్ అభిమానులు జోక్ చేసుకున్నారు. తరువాత అభిమానుల ఆగ్రహానికి భయపడి కాబోలు.. వరుణుడు పక్కకి తప్పుకున్నాడు. ఆక్కడ నుంచి వరల్డ్ కప్ అసలు మజా ప్రారంభం అయింది. ఆస్ట్రేలియా జట్టు ఇండియా మీద ఓడిపోయింది. అలవోకగా అప్రతిహతంగా సాగుతున్న టీమిండియాకు ఇంగ్లాండ్ షాకిచ్చింది. అసలు టైటిల్ ఎగరేసుకుపోయే సత్తా ఇంగ్లాండ్ కే ఈ సారి ఎక్కువుందని క్రికెట్ పండితులు లేక్కలేసిన వేళ.. వరుసగా మ్యాచ్లు ఓడి సెమీస్ చేరడం కష్టతరం అనిపించుకుంది. 
లీగ్ దాటి సెమిసీ అడుగులు

కానీ మళ్లీ పుంజుకుని వరుస విజయాలతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇక న్యూజిలాండ్ పడుతూ, లేస్తూ చివరి బెర్త్ దక్కించుకుంది. ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి వరల్డ్ కప్ అంచనాలకు అనుగుణంగానే సాగింది. ఇక ఇప్పటి నుంచి ఎలా ఉంటుందో.. ఫైనల్ గెలిచే వీరులేవరో తేలాల్సి ఉందిఆస్ట్రేలియా.. ఓకే ఒక్క మ్యాచ్ కోల్పోయింది. అదీ టీమిండియా మీద. మిగిలిన అన్ని మ్యాచ్ ల్లోనూ సాధికారిక విజయాన్ని సాధించింది ఆసీస్. ఎక్కడా తడబాటు లేకుండా ఆడి టైటిల్ ఫేవరేట్ ఎలా ఉండాలో చూపించారు కంగారూలు. ఇంకా ఒక మ్యాచ్ సౌతాఫ్రికాతో ఈరోజు ఆడాల్సి ఉంది. అయినా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. వరుణుడి దెబ్బ ఈ జట్టు మీద పడకపోవడం విశేషం టీమిండియా.. కప్పు కచ్చితంగా గెలుస్తుంది అన్న అంచనాలతో టోర్నీలో ఆడుగు పెట్టిన ఇండియా.. అదే తరహా ఆటతీరును ప్రదర్శించింది. అయితే వరుణుడు కూడా పోటీ పడడంతో.. న్యూజిలాండ్ తో పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది. అప్రతిహతంగా సాగిన ఇండియా జైత్రయాత్రకు ఇంగ్లాండ్ బ్రేకేసింది. కానీ, ఆ పోరులోనూ ఇండియా చివరి వరకూ నిలిచింది. ఇక బంగ్లాదేశ్ తో ఓ మ్యాచ్ ఆడాల్సి ఉన్నా.. రెండోస్థానాన్ని ఖాయం చేసుకుంది. ఇపుడు ఆస్ట్రేలియా ఓడిపోయి, ఇండియా బంగ్లాదేశ్ మీద విజయం సాధిస్తే టాప్ ప్లేస్ కు చేరుకునే అవకాశాలూ ఉన్నాయి. ఇంగ్లాండ్.. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ప్రారంభంలో ఆదరగొట్టింది. తరువాత నీరసించింది. భారత్ మీద గెలుపుతో మళ్లీ తెరమీదకు హుందాగా వచ్చింది. న్యూజిలాండ్ మీద ఘన విజయం సాధించి మూడో స్థానంలో సెమీస్ ఆడటానికి రెడీ అయిపొయింది. న్యూజిలాండ్.. నాలుగో స్థానానికి విచిత్రమైన పోటీ నెలకొంది. కొన్ని జట్ల పరాజయం కోసం పాకిస్థాన్ ఎదురుచూసింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఇండియా మీద పరాజయం పాలైతే సెమీస్ బెర్త్ కచ్చితంగా పాకిస్థాన్ కు దక్కేది. అయితే, రెండు మ్యాచులు వరుసగా గెలిచి పాకిస్థాన్ ఆశల్ని అడియాశలు చేసింది ఇంగ్లాండ్. ఇక న్యూజిలాండ్ పడుతూ, లేస్తూ నాలుగో నెంబరులో సెమీస్ కు చేరింది. ఇపుడు దాదాపుగా మొదటి సెమీస్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ల మధ్య జరుగుతుంది. రెండో సెమీస్ ఇంగ్లాండ్, ఇండియాల మధ్య జరుగుతుంది. ఆస్ట్రేలియా ఫాం ప్రకారం చూస్తే ఫైనల్ కు సులువుగా చేరే అవకాశాలున్నాయి. ఇక రెండో సెమీస్ మాత్రం హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్, ఇండియా రెండూ సమవుజ్జీలే. అయితే, లీగ్ లో తమకెదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం మాత్రం భారత్ కు ఉంది. టీమిండియా ఏం చేస్తుందో చూడాలి.