పారదర్శకత కోసమే కొత్తపురపాలక చట్టం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పారదర్శకత కోసమే కొత్తపురపాలక చట్టం

హైదరాబాద్, జులై 19 (way2newstv.com):
తెలంగాణ రాష్ట్రంలోని  మున్సిపాలిటీల్లో పునరుత్తేజం నింపడం కోసంమే కొత్త చట్టం తీసుకొస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం నాడు  నూతన పురపాలక చట్టం -2019 ప్రాముఖ్యతను వివరిస్తూ సభలో కేసీఆర్ ప్రసంగించారు. నూతన చట్టం ద్వారా పారదర్శక పాలన అందించే అవకాశం ఉంటుందని అన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసు ఇవ్వకుండానే కూల్చివేస్తామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ కట్టడాలను ఉపేక్షించమన్నారు. యజమానులే ఇంటి నిర్మాణానికి సంబంధించిన సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాలని అన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలోని ప్లెయింగ్ స్క్వాడ్ బృందం ఇళ్లకు సంబంధించిన కొలతలు చేపడుతుందని అన్నారు.
 పారదర్శకత కోసమే కొత్తపురపాలక చట్టం

500 చదరపు గజాల వరకు నిర్ణీత సమయంలో ఆన్లైన్లోనే అనుమతి వస్తుందన్నారు. ఎన్నికల కమిషన్ అనేది ఓ స్వతంత్ర సంస్థ అని, ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఈసీ విధుల్లో కలుగజేసుకోబోమని, అయితే పురపాలిక ఎన్నికల తేదీలను నిర్వహించే అధికారం మాత్రం ప్రభుత్వానికే ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, స్పీకర్కు లేని అధికారాలు వీఆర్వోలకు ఉన్నాయని అన్నారు. వీఆర్వో తలచుకుంటే ఒకరి భూమిని మరొకరికి రాసిచ్చేయగలరని తెలిపారు. ఈ కొత్త చట్టం ద్వారా అధికారులు, ఉద్యోగులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలే చేసే అధికారం వస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త డోర్ నంబర్లు ఇస్తున్నామని, రాష్ట్రంలో ప్రతి ఇంటికి డోర్ నంబర్ కచ్చితంగా ఉండాలని కేసీఆర్ శాసనసభలో వెల్లడించారు. గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మాగాంధీ కలలు కన్నారని.. పంచాయతీరాజ్ అనేది ఒక విభాగం కాదు..ఉద్యమమని అన్నారు. తాను దుబ్బాక స్కూల్లో చదువుకునే రోజుల్లో పంచాయతీ రాజ్ స్పూర్తిని చవిచూశానని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆకలితో అలమటిస్తోన్న ప్రజల కడుపులు నింపాలని చెప్పారు. సముద్రం పాలయ్యే నీటికి ఆనకట్టలు కట్టి పొలాలకు మలపాలని, ఆహార భద్రత విషయంలో స్వావలంభన అందించాలని అన్నారు. ప్రతీ ప్రజాప్రతినిధి పంచవర్ష ప్రణాళికను అధ్యయనం చేయాలని, రెండో పంచవర్ష ప్రణాళికను నెహ్రూ పూర్తిగా మార్చేశారన్నారు. ఆధునిక దేవాలయాల పేరుతో ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. పంచాయతీ రాజ్ ను ఒప్పుడు కమ్యూనిటీ డెవలప్ మెంట్ అనేవారు. బలమైన పునాదులున్న రాజ్యాంగం మనది. రాజేంద్రనగర్ లో నాడు ఎస్కేడే స్థాపించిన సంస్థే ఎన్ఐఆర్డీ అని అన్నారు. పంచాయతీ రాజ్ ఉద్యమంలో ఉన్న గొప్పతనం. అందులో పనిచేసిన వాళ్లు అవలంభించిన విధానాలు, ఆనాటి సమితి అధ్యక్షులు, ఆనాటి బీడీవోలు వాళ్లను సమాజం గౌరవించిన తీరుతెన్నులు చాలా చాలా గొప్పగా ఉండే. అటువంటి స్పిరిటే మున్పిపాలిటీల్లో కూడా ఉండేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తర్వాత మనదేశంలో భయంకరమైన రాజకీయమైన జబ్బులు అలుముకున్నాయి. అవన్నీ విస్తరించి ఈ ఉద్యమాలను పొలిటికలైజ్ చేసి, డిపార్టుమెంటలైజ్ చేసి స్పిరిట్ ను చంపశారన్నారు. అవి పొందాల్సిన  అవసరముందని సీఎం కేసీఆర్ అన్నారు.