పోలవరం నిజాలు బయిటకొస్తాయి : విజయసాయిరెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పోలవరం నిజాలు బయిటకొస్తాయి : విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ, జూలై 17, (way2newstv.com
 ప్రభుత్వంలో జరిగిన అవినీతి అంతా బయటకొస్తుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. కేంద్రం నుంచి క్లీన్ చిట్ వచ్చినట్టు టీడీపీ నేతలు మురిసిపోతున్నారని.. నాలుగు రోజులు ఓపిక పడితే నిజాలన్నీ బయటకొస్తాయని ఎద్దేవా చేశారు. దోచుకున్న సొమ్మునంతా కక్కించే దాకా ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పారు. ఈ మేరకు బుధవారం (జులై 17) వరస ట్వీట్లు చేశారు. పోలవరంపై రాజ్యసభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి చెప్పిన జవాబును చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు సరిగా బ్రీఫ్ చేసి ఉండరని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ‘సీబీఐ రంగంలోకి రాదని చంద్రబాబు మురిసి పోతున్నారేమో.. పోలవరం ప్రాజెక్టు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు’ అని విజయసాయి రెడ్డి తెలిపారు. 
పోలవరం నిజాలు బయిటకొస్తాయి : విజయసాయిరెడ్డి

‘పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కల్పతరువులా భావించారు. అంచనాలు పెంచి ప్రతి పనిలో నిధులు దోచుకున్నారు. ప్రాజెక్టు, జలవిద్యుత్ కేంద్రం నిర్మాణాల్లో రూ.2343 కోట్లు కాంట్రాక్టర్లకు అదనంగా చెల్లించారని నిపుణుల కమిటీ తేల్చింది. ఇదీ కక్ష సాధింపే అంటారా బాబూ?’ అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ‘పోలవరంలో అవినీతి, విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాల పైన కేంద్రం నుంచి క్లీన్ చిట్ వచ్చినట్టు మురిసి పోతున్నారు పచ్చదొంగలు. నాలుగు రోజులు ఓపిక పట్టండి అన్నీ బయట పడతాయి. దోచుకున్న వేల కోట్లు కక్కించేదాకా ప్రభుత్వం వదిలి పెట్టదు’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. పోలవరంపై రాజ్యసభలో నేను అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి చెప్పిన జవాబును చంద్రబాబు గారికి సరిగా బ్రీఫ్ చేసినట్టు లేరు. ప్రాజెక్టు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరుపుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. సీబీఐ రంగంలోకి రాదని మురిసి పోతున్నారేమో బాబు గారు.ఎయిర్ ఇండియా సంస్థను నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోందని రాజ్యసభలో పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరిని ప్రశ్నించానని విజయసాయి రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్‌ వర్శిటీ, సెంట్రల్‌ ట్రైబల్‌ వర్శిటీ ఏర్పాటుకు చట్టబద్దత కల్పించేందుకు ఉద్దేశించిన సెంట్రల్‌ యూనివర్శిటీ చట్ట సవరణ బిల్లు అంశంపై మాట్లాడినట్లు తెలిపారు