పరుగులు పెడుతున్న ప్రాజెక్టుల పనులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పరుగులు పెడుతున్న ప్రాజెక్టుల పనులు

వరంగల్, జూలై 25, (way2newstv.com)
గోదావరి నదీ పరివాహక ప్రాంతం అంతా ఇప్పుడు దేవాదుల కమాండ్ ఏరియా కిందికి తెచ్చే బృహత్తర మహాయజ్ఞం కొనసాగుతోంది. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున సాగునీరు అందించాలనే లక్ష్యానికి దాదాపుగా చేరువయ్యాం. చిన్నచిన్న గ్యాప్‌లను పూరించడం కోసం ప్రభుత్వం, సాగునీటిపారుదల శాఖ ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పర్యవేక్షణ, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రత్యేక దృష్టి తోడైంది. వచ్చే సీజన్ రెండో పంట కాలానికి ఎలాగైనా లక్ష్యాన్ని ముద్దాడాలనే సర్కార్ సంకల్పం ఆచరణ సాధ్యంగా నిర్దేశిత ప్రాజెక్టు పనుల పురోగతి స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మరోవైపు దేవాదుల ఎత్తిపోతల పథకం. 
పరుగులు పెడుతున్న ప్రాజెక్టుల పనులు

తుపాకులగూడెం, ఎస్సారెస్పీ మొదటి, రెండో దశ, మూడో దశ పనులు పురోగతిలో ఉన్నాయి. అన్నీ అనుకున్న ప్రకారం చేసేందుకు సాగునీటిపారుదల శాఖ అధికారులు అహోరాత్రులు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 18 చిన్న, పెద్ద రిజర్వాయర్లు పూర్తి చేసుకున్నాం. రూ. 3220 కోట్లతో 10.78 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో లింగంపల్లి రిజర్వాయర్‌కు ప్రభుత్వం ఇటీవలే పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. వచ్చేనెల ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రిజర్వాయర్ పనులకు భూమి చేయబోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇప్పటి వరకు ఇంతపెద్ద నీటినిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ లేదు. లింగంపల్లి రిజర్వాయర్ ద్వారా వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలోని సాగునీటి అవసరాలు తీర్చడం ఒక ఎత్తు అయితే ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం దేవాదుల కమాండ్ ఏరియగా మారిపోయే వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఇట్లా మొత్తంగా చూసినప్పుడు ప్రభు త్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పది నియోజకవర్గాలకు పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికగా కొనసాగుతోంది.