మార్కెట్లో మండుతున్న కూరగాయాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మార్కెట్లో మండుతున్న కూరగాయాలు


నెల్లూరు, జూలై 1, (way2newstv.com)
నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. పప్పు, ఉప్పులే కాదు. కాయగూరలు కూడా సామాన్యులకు భారంగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖే ఈ విషయాన్ని ధృవీకరించింది. నిత్యావసర వస్తువుల ధరలను గత ఏడాదితో పోలుస్తూ ఆ శాఖ అధికారులు ఒక నివేదికను రూపొందించి కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి అందచేశారు. గత ఏడాది మే తో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో దాదాపుగా అన్ని రకాల వస్తువుల. కూరగాయల ధరలు పెరిగాయని వీరు ప్రభుత్వానికి నివేదించారు. జూన్‌లో కూడా ధరల పెరుగుదల యధావిధిగా కొనసాగింది. అధికారులు వివరాలు సేకరించిన 30 సరుకుల్లో 26 సరుకుల ధరలు పెరిగాయని నివేదికలో అధికారులు పేర్కొన్నారు. ఇతర వస్తువులతో పోలిస్తే టమాటా ఏకంగా 167 శాతం పెరిగిందని అధికారులు పేర్కొన్నారు. జూన్‌ నెలలో కూడా కిలో 80 నుండి 50 రూపాయల వరకు ధర పలికిన విషయాన్ని అధికారులు ప్రస్తావించారు. 

మార్కెట్లో మండుతున్న కూరగాయాలు

దీరతో సాధారణ, మధ్య తరగతి ప్రజలు దాదాపుగా టమోటావైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. వంకాయలు కూడా గత ఏడాది మే కన్నా దాదాపు 26 శాతం పెరిగిరది. బెరడకాయిల ధర 11 శాతం, అరటి మూడు శాతం, బంగాళాదురప ఒక శాతం చొప్పున పెరగడంతో వంట చేసుకునేరదుకే సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి నెలకొరది. ఇక ఇతర నిత్యావసరాలను పరిశీలిస్తే పిక్కతో కూడిన చిరతపండు 24.13 శాతం, కందిపప్పు 25.49 శాతం, జొన్నలు 22.71 శాతం, మినప్పప్పు 14 శాతం పెరిగిపోయాయి. చక్కెర ఎనిమిది శాతం, మిర్చి పొడి ఏడు శాతం పెరిగాయి. బియ్యం, నూనెలు, చివరకు ఉప్పు ధరలు కూడా గత ఏడాదితో పోలిస్తే పెరిగాయని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. రెరడో రకం బియ్యం గత ఏడాదికన్నా మూడుశాతం పెరగ్గా, గోధుమ 5.38 శాతం, రాగులు 7.70 శాతం పెరగ్గా, నూనెల్లో వేరుశెనగ 7.45 శాతం, సన్‌ఫ్లవర్‌ అయిల్‌ ఐదు శాతం పెరిగాయి. స్ఫటిక ఉప్పు ధర రెరడు శాతం పెరగ్గా, అయోడైజ్‌డ్‌ ఉప్పు ధర ఐదు శాతం పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే తగ్గినట్లు గుర్తిరచారు. రాగులు, వనస్పతి ధరలు స్వల్పంగా తగ్గగా, పిక్కలేని చిరతపండు 20 శాతం, పామ్‌ ఆయిల్‌ ధర పది శాతం తగ్గినట్లు అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ధరలను అదుపులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఏం చర్యలు తీసుకుంటుందో చూడాల్సిఉంది. వర్షాలు పడితే కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.