విజయవాడ, జూలై 19, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తారు. ప్రతి దానిలో రాజకీయంగా లాభం వెతికే పనిలో ఉంటారు
చంద్రబాబునాయుడు. ఇది అందరికీ తెలిసిందే. ఆయన ఏపనైనా రాజకీయంగా ఉపయోగపడుతుందంటేనే చేస్తారన్నది వాస్తవం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న శాసనసభ సమావేశాలను కూడా చంద్రబాబు చక్కగా ఉపయోగించుకుంటున్నారు.చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అనుసరిస్తున్న వైఖరిని చూస్తే నిజమేననిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్ లో చూస్తున్న వారెవరైనా చంద్రబాబునాయుడును చూసి జాలిపడక మానరు.
చంద్రబాబు మౌనం వెనుక...
ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఒంటికాలిమీద చంద్రబాబునాయుడు మీద లేస్తున్నప్పుడు ఆయన విషణ్ణ వదనంతో మాట్లాడుతున్న తీరు అందరినీ జాలిగొలిపేలా చేస్తోంది.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాలు కావడంతో సహజంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఉత్సాహంగా ఉంటారు. ఏమాత్రం అవకాశం వచ్చినా దూకుడు ప్రదర్శిస్తారు. అందులో వైసీపీ లో 70 మంది వరకూ యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా జగన్ కు వీరవిధేయులు కావడంతో ఏ మాత్రం అవకాశమొచ్చినా చంద్రబాబునాయుడుపై చిందులు తొక్కడం ఖాయం. ఇది చంద్రబాబునాయుడు అడ్వాంటేజీగా తీసుకుంటున్నట్లుంది. ఒకవైపు అచ్చెన్నాయుడుతో వైసీపీ సభ్యులను రెచ్చగొట్టించి తమపై మాటల దాడి చేయగానే ఆయన మైకు అందుకుంటున్నారు.ఒకరకంగా ఇది అసెంబ్లీలో చంద్రబాబునాయుడు స్ట్రాటజీ అని పార్టీ వర్గాలు సయితం చెబుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబునాయుడు ఏం మాట్లాడినా దీనంగా మాట్లాడుతున్నారు. ఎటువంటి విచారణకైనా సిద్ధమని సవాల్ విసురుతూనే తన అనుభవానికి, వయసుకు గౌరవమివ్వాలని సూచిస్తున్నారు. అలాగే వైసీపీ వ్యాఖ్యలకు కౌంటర్లు కూడా ఇస్తున్నారు. ఒకరకంగా తనతో పాటు పార్టీకి సానుభూతిని తెచ్చిపెట్టేందుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను చంద్రబాబు చక్కగా ఉపయోగించుకుంటున్నారన్నది వాస్తవం.
Tags:
Andrapradeshnews