మేకపాటికి రాజ్యసభ ఛాన్స్..

నెల్లూరు, జూలై 26, (way2newstv.com)
మేకపాటి రాజమోహన్ రెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేత. ఎన్నికలకు ముందు వరకూ మేకపాటి రాజమోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. అయితే ఎన్నికల తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డికి వైఎస్ జగన్ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం టిక్కెట్ కూడా ఇవ్వలేదు. ఆయన స్థానంలో అప్పుడే పార్టీలో చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు.అయితే తాను టిక్కెట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నానో మేకపాటి రాజమోహన్ రెడ్డికి జగన్ వివరించారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాజ్యసభ స్థానాన్ని ఇస్తామని కూడా జగన్ మేకపాటి రాజమోహన్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే మేకపాటి రాజమోహన్ రెడ్డికి రాజ్యసభ పదవి ఇవ్వడం సాధ్యం కాదని దాదాపు తేలిపోయింది. 
మేకపాటికి రాజ్యసభ ఛాన్స్..

అందుకే జగన్ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డికి మంత్రిపదవి ఇచ్చారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మేకపాటి రాజమోహన్ రెడ్డికి రాజ్యసభ పదవి ఇవ్వకపోవడానికి అనేక కారణాలున్నాయి. పార్టీ కోసం తొమ్మిదేళ్లుగా పనిచేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డికి మరో పదవిని ఇవ్వాలన్నది జగన్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు గౌరవప్రదమైన పదవి ఇవ్వాలన్న యోచనలో జగన్ ఉన్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఇద్దరు సభ్యులు వైసీపీ తరుపున ఉన్నారు. వారిలో విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఉన్నారు.మేకపాటి రాజమోహన్ రెడ్డికి రాజ్యసభ పదవి ఇస్తే మరో రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినట్లవుతుంది. అంతేకాకుండా ప్రాంతాల వారీగా చూసుకున్నా మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఇవ్వడం సాధ్యం కాదు. విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఇద్దరూ నెల్లూరు జిల్లాకు చెందిన నేతలే. నెల్లూరు జిల్లాకు చెందిన మరో నేతకు రాజ్యసభ పదవి ఇచ్చే ఛాన్స్ ఉండదు. సో…మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఈసారి రాజ్యసభ పదవి దక్కే అవకాశం లేదని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి.
Previous Post Next Post