అమల్లోకి వచ్చిన అంగన్ వాడీ పౌష్టికాహారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమల్లోకి వచ్చిన అంగన్ వాడీ పౌష్టికాహారం

విజయనగరం, జూలై 31, (way2newstv.com)
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పోషణ అభియాన్‌ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మరియు ఇతర జనాభాలో గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లల పోషణ స్థితి మెరుగుదలకు అదనపు పౌష్టికాహారం అందించే ప్రత్యేక కార్యక్రమం అంగన్‌వాడీల్లో అమలు కానుంది.రక్తహీనత గల హైరిస్క్‌ గర్భిణులు, బాలింతలు, తీవ్ర పోషకాహార లోపం ఉన్న ఏడు నెలల నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు ఉచితంగా పౌష్టికాహారం అందించేందుకు ఈ నెల 27న పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలో 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్ల 3,728 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా పోషణ అభియాన్‌ పథకం కింద పౌష్టికాహారం అందించనున్నారు.గర్భిణులు, బాలింతలకు హీమోగ్లోబిన్‌ తక్కువగా ఉండడంతో పాటు పొడవు 45 సెంటీమీటర్లు, 35 కిలోల కంటే తక్కువ ఉన్న వారికి, చిన్న వయసులో వివాహం జరిగి గర్భం దాల్చిన వారికి, 35 సంవత్సరాలు తరువాత గర్భం దాల్చిన వారికి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తారు.
అమల్లోకి  వచ్చిన అంగన్ వాడీ పౌష్టికాహారం

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 1.46 లక్షల మంది పిల్లలు ఉండగా వారిలో తీవ్ర పౌష్టికాహార లోపంతో రక్తహీనత కలిగిన ఏడు నెలల నుంచి ఆరేళ్లలోపు ఉన్న పిల్లలు 18 వేల మంది ఉన్నారు. వీరందరికీ రోజూ అందిస్తున్న మెనూతో పాటు కొత్త మెనూ ప్రకారం ప్రతి రోజూ ఒక గుడ్డు, 200 గ్రాముల పాలు అదనంగా ఇవ్వనున్నారు.రక్తహీనత హైరిస్క్‌ గల గర్భిణులు, బాలింతలకు రోజూ అందిస్తున్న మె నూతో పాటు రోజూ ఉదయం 50 గ్రాముల బెల్లంతో తయారు చేసిన వేరుశనగ చెక్కి, మధ్యాహ్నం ఒక గుడ్డు, వంద మి.లీ. పాలు, సాయంత్రం 50 గ్రాముల నువ్వల చెక్కి అదనపు పౌష్టికాహారంగా అందివ్వనున్నట్టు అధికారిక సమాచారం.అంగన్‌వాడీ కేంద్రాలలో తీవ్ర పౌష్టికాహార లోపంతో ఉన్న గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు కోసం పోషణ అభియాన్‌ పథకం ద్వారా కొత్త మెనూ ప్రారంభించారు. బాలింతలు, గర్భిణులు, పిల్లలు ఈ కొత్త మెనూను సద్వినియోగ పరుచుకుంటే పౌష్టికాహార లోపాన్ని అధిగమించవచ్చును. పౌష్టికాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో ఈ పథకం అమలు కానుందని పీడి చెబుతున్నారు.గతంలో గర్భిణులకు, బా లింతలకు అదనపు పౌష్టికాహారం అందించేందుకు నేను సైతం అనే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిం ది.  ఈ పథకంలో భాగంగా దాతలు ద్వారా అదనపు పౌష్టికాహారాన్ని సేకరించి అందించామంటున్నారు.