విద్యార్ధులు బాగా చుదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విద్యార్ధులు బాగా చుదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలి


ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ
రాజమహేంద్రవరం జూలై 2 (way2newstv.com)
విద్యార్ధులు బాగా చుదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌ సూచించారు. స్థానిక 9వ డివిజన్‌ బర్మా కాలనీలోని మున్సిపల్‌ పాఠశాలలోని విద్యార్ధులకు వసూధ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌ ముఖ్య అతిధిగా హాజరై విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ చేశారు.


విద్యార్ధులు బాగా చుదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలి

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్ధి దశ నుంచే లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని చేరుకునేందుకు సాధన చేయాలని పిలుపునిచ్చారు. పేద విద్యార్ధులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మాట్లాడుతూ ఉన్న అవకాశాలను వినియోగించుకుని విద్యార్ధులు చక్కగా చదువుకుని బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలన్నారు. విద్యార్ధి దశలో తలొంచి చదివితే రేపన్న రోజు ఆ చదువే తలెత్తుకునే చేస్తుందన్నారు. అందుకే చదువును నిర్లక్ష్యం చేయకుండా విద్యార్ధులు చక్కగా చదవుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ కోసూరి చండీప్రియ, ఎంఎస్‌ఎన్‌ రాజు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.