నాగ్ రూట్ లో మహేష్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నాగ్ రూట్ లో మహేష్

హైద్రాబాద్. జూలై 16  (way2newstv.com)
మహేష్ బాబు ఏదన్నా సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా నుండి అప్ డేట్ చాలా లేట్ గా వస్తుంది. షూటింగ్ కంప్లీట్ చేసిన కానీ ఆ సినిమా టైటిల్ ని రివీల్ చేయరు. అలానే టీజర్, ట్రైలర్స్ విషయంలో ఏదొక ముహూర్తం పెట్టి రిలీజ్ చేస్తుంటారు. అయితే అది గతం. ఇప్పుడు మహేష్ ఆ స్ట్రాటజి ని ఫాలో అవ్వడంలేదు. తన లేటెస్ట్ మూవీ విషయంలో మహేష్ ఓ కొత్త స్ట్రాటజి ని ఫాలో అవుతున్నాడు.అతను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న ‘సరిలేరు నీకు ఎవరు’ అనే మూవీ నుండి రెగ్యులర్ గా అప్ డేట్స్ అందుకోవచ్చు అంట. 
నాగ్ రూట్ లో మహేష్

ఏదొక ముహూర్తం పెట్టి స్టిల్స్ విడుదల చేసే కార్యక్రమాలు మానుకున్నారు. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి దశలవారీగా స్టిల్స్ విడుదల చేయాలని నిర్ణయించారు. రీసెంట్ గా రెండు మూడు వర్కింగ్ స్టిల్స్ బయటకు వచ్చాయి. ఇక త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు.ప్రతి నెల ఏదోకటి స్టిల్ రిలీజ్ చేయాలనీ, వీటితో పాటు సాంగ్ మేకింగ్స్, టీజర్, ట్రైలర్స్ కూడా రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట. సేమ్ ఇదే ఫాలో అవుతున్నాడు నాగార్జున. నాగ్ లేటెస్ట్ మూవీ మన్మధుడు-2 సినిమా విషయంలో సినిమా సెట్స్ మీద ఉన్నప్పటి నుండి స్టిల్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. ఈ స్ట్రాటజి సినిమాకి బాగా ప్లస్ అయింది. సో మహేష్ కూడా అందుకే అదే ఫార్ములా ని ఫాలో అవుతున్నాడు