కేశినేని నాని దూకుడు దేనికీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేశినేని నాని దూకుడు దేనికీ

విజయవాడ, జూలై  31, (way2newstv.com)
విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి జోష్ మీద వున్నారు. సొంత పార్టీవారిపై తొలుత పోరాటం మొదలు పెట్టిన ఆయన ఆ తరువాత వైసిపి పై కూడా విరుచుకుపడుతూ రాజకీయాలు సాగిస్తున్నారు. మధ్యలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ని కలుసుకుని మరో సంచలనం సృష్టించారు. ఇలా ఇంటా బయట చెలరేగిపోతున్న ఆయన దూకుడు కు కళ్ళెం వేసేలా కేశినేని ట్రావెల్స్ వివాదం వీధికెక్కింది. గతంలో ఆయన నిర్వహించిన ట్రావెల్స్ మూసి వేత సందర్భంగా జీతాలు ఎగ్గొట్టి నీతులు చెబుతున్నారంటూ ఆందోళనలు మొదలు కావడంతో నాని ఇరుకున పడ్డారుకేశినేని నాని ట్రావెల్స్ మూసివేత సందర్భంగా ఉద్యోగులకు జీతాలు ఎగ్గొట్టడం పై కమ్యూనిస్ట్ లు ముందుకు వచ్చి కార్మికులకు అండగా నిలిచారు. 
కేశినేని నాని దూకుడు దేనికీ

దీనిపై నాని అగ్గిమీద గుగ్గిలమే అయ్యారు. కమ్యూనిస్ట్ లు కిరాయి వ్యవహారాలు చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజలకు దూరం అయ్యారని ట్విట్టర్ లో వ్యాఖ్యానించి వివాదాన్ని మలుపు తిప్పారు. కార్మికులకు బకాయిపడ్డ వివాదం లేబర్ కోర్ట్ లో ఉందంటూ ఆయన వ్యాఖ్యలు సైతం మీడియా లో చేసి బాకీ నిజమే అన్నది పరోక్షంగా అంగీకరించడం విశేషం. దీనిపై కమ్యూనిస్ట్ లు ఘాటుగా స్పందించారు. కేశినేని నాని కార్మికులకు చేసిన అన్యాయం నిజమా? కాదా? అంటూ నిలదీశారు. న్యాయం కోసం ఆష్రయించిన వారిని కొట్టి పంపించలేదా అంటూ కడిగేశారు.కేశినేని ట్రావెల్స్ దక్షిణాది రాష్ట్రాల్లో నెంబర్ వన్ ప్రయివేట్ ట్రావెల్స్ గా పేరుఉండేది. అయితే రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం ఈ ట్రావెల్స్ పై విచారణ జరిపి తప్పులు తవ్వి తీయడంతో చంద్రబాబు సర్కార్ లో పెద్ద వివాదమే నడిచింది. ఎమ్యెల్యే బోండా ఉమా తో కలిసి రవాణాశాఖ కార్యాలయంలోనే దౌర్జన్యానికి దిగడం అప్పట్లో సంచలనమే అయ్యింది. ఈ నేపథ్యంలో మొత్తం కేశినేని ట్రావెల్స్ పై పెద్ద చర్చే తెలుగు రాష్ట్రాల్లో సాగింది. దాంతో కేశినేని నాని తన ట్రావెల్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించి అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి పూర్తి స్థాయి రాజకీయాల్లోనే కొనసాగాలని నిర్ణయం తీసుకోవడం జరిగిపోయాయి. నాటి ట్రావెల్స్ మూత సందర్భంగా ఉద్యోగులకు కేశినేని నాని సంస్థకు నడుమ బకాయిల వివాదం కొనసాగుతూనే వుంది. అయితే అధికారపార్టీలో ఎంపిగా ఉండటంతో అప్పుడు నోరుమెదపలేని స్థితిలో వున్న బాధితులు సర్కార్ మారడంతో ధైర్యం చేసి రోడ్డెక్కడంతో ఇప్పుడు విజయవాడ ఎంపి కేశినేని నాని ఇరుకున పడ్డారు. అయితే ఈ వ్యవరంపై ఎదురుదాడి వ్యూహాన్నే కేశినేని నాని అనుసరిస్తున్నారు. ఇది ఎంతవరకు ఆయనకు జరిగిన డ్యామేజ్ కంట్రోల్ చేస్తుందో చూడాలి