ఇంగ్లీషు పుత్రి... అంటూ మంచు కు శ్రీ రెడ్డి సెటైర్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇంగ్లీషు పుత్రి... అంటూ మంచు కు శ్రీ రెడ్డి సెటైర్లు

చెన్నై, జూలై 2, (way2newstv.com)

సినిమా రిలీజ్‌కి ముందు ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించే ప్రీ రిలీజ్ వేడుకలు, ఆడియో ఫంక్షన్లు ఆయా సినిమాలకు హైప్ తీసుకువస్తుంటాయి. ఈ కార్యక్రమాలకు స్టార్ హీరోలను గెస్ట్‌లుగా పిలవడం.. వారితో స్పీచ్‌లు ఇప్పించడం ద్వారా ఒక హీరో సినిమాలను ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఆదరిస్తుండటం టాలీవుడ్‌లో ఆనవాయితీగా మారింది. ఇదే సందర్భంలో కొన్ని కొన్ని సినిమా ఫంక్షన్లు ప్రమోషన్స్ సంగతి అంటుంచితే భజన కార్యక్రమాలుగా మారుతున్నాయి. సూపరు.. డూపరు.. ఇరగదీసేశాడు.. పక్కా 100 రోజులు.. బాక్సాఫీస్ బద్దలు.. ఇలాంటి కూతలకు కొదువే ఉండదు. ఇక వారి స్పీచ్‌లలో భాగంగా చేసిన వ్యాఖ్యలు వివాదమైన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మైక్ దొరికింది కదా అని ముందు వెనుక ఆలోచించకుండా.. 

ఇంగ్లీషు పుత్రి... అంటూ మంచు కు శ్రీ రెడ్డి సెటైర్లు

నోటికొచ్చినట్టు మాట్లాడేస్తే నెటిజన్లు ట్రోల్ చేసిన సందర్భాలు అనేకం. తాజాగా మంచులక్ష్మిని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. సమంత లీడ్ రోల్‌లో నటించిన ‘ఓ బేబీ’ చిత్రం జూలై 5న విడుదల కానుండటంతో శనివారం నాడు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటేష్, రానా‌ ముఖ్య అతిథులుగా హాజరుకాగా.. మంచు లక్ష్మి కూడా హాజరై స్పీచ్ ఇచ్చింది. ఇందులో భాగంగా.. ‘ఓ బేబీ’ చిత్రంలో నటించిన సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌‌ను పొగడ్తల వర్షంలో ముంచెత్తే ప్రయత్నంలో ‘మీరు నటించిన జంబలకిడిపంబ చిత్రం వెయ్యిసార్లుగా పైగా చూసి.. ఆ క్యాసెట్ అరగ్గొట్టేశాం’ అంటూ కాస్త ఎక్కువ చేసి మాట్లాడారు. అదేంటి..? ‘జంబలకిడిపంబ’ చిత్రంలో హీరో నరేష్ కదా.. మరి రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు నటించాడబ్బా.. అమ్మా మంచులక్ష్మీ కాస్త తెలుసుకుని స్పీచ్‌‌లు ఇవ్వవమ్మా అంటూ నెటిజన్లు ట్రోల్స్ మొదలు పెట్టారు. ఈ ట్రోలర్స్‌కి ఊతం ఇస్తూ ప్రముఖ నటి శ్రీరెడ్డి.. మంచులక్ష్మిపై సెటైర్లు పేల్చింది. తన ఫేస్ బుక్ ద్వారా మంచు లక్ష్మిని ‘ఇంగ్లీ పుత్రీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ‘మంచులక్ష్మి జీ.. ‘జంబలకిడిపంబ’ హీరో రాజేంద్రప్రసాద్ గారు కాదమ్మా... పొగడకపోయినా పర్లేదు అవమానించకమ్మా’ అంటూ ఫేస్ బుక్ పోస్ట్ వదిలింది శ్రీరెడ్డి.