విజయవాడ, జూలై 23 (way2newstv.com)
ఏపీ నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు విజయవాడలోని రాజ్ భవన్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ లో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. పాత సీఎం క్యాంపు కార్యాలయాన్ని రాజ్ భవన్ గా మార్పు చేశారు. వారం రోజుల నుంచి ఇక్కడ సాగుతున్న ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. గవర్నర్ నివాసం వద్ద భద్రత నిమిత్తం ఐఎస్ డబ్ల్యూ సిబ్బంది, ఏపీఎస్పీ బెటాలియన్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.
ఇవాళ ఏపీకి కొత్త గవర్నర్ బాధ్యతలు
గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి బిశ్వభూషణ్ వెళ్లి, అమ్మ వారిని దర్శించుకుంటారని, అనంతరం, రాజ్ భవన్ కు ఆయన చేరుకుంటారని సమాచారం. నూతన గవర్నర్ గా బిశ్వభూషణ్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయిస్వామి వారి దర్శనం.ఏపీ కొత్త గవర్నర్ హరిచందన్ తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తన కుటుంబసభ్యులతో కలసి భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన... అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు టీటీడీ ఈవో సింఘాల్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు
Tags:
Andrapradeshnews