కూకట్ పల్లి ప్రాంతంలో చిరుతపులి... ప్రజల్లో ఆందోళన! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కూకట్ పల్లి ప్రాంతంలో చిరుతపులి... ప్రజల్లో ఆందోళన!

హైదరాబాద్ జూలై 31  (way2newstv.com -Swamy Naidu):,
నిత్యమూ పగలనకా, రాత్రనకా ఎంతో బిజీగా ఉండే హైదరాబాద్, కూకట్ పల్లి పరిధిలో ఓ చిరుతపులి కనిపించడం, అది ఓ వ్యక్తిపై దాడి చేసిందని వార్తలు రావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రగతినగర్‌ గాజులరామారం మధ్య ఈ చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు స్థానికులు చిరుతపులి ఫోటోలను, వీడియోలను తమ స్మార్ట్ ఫోన్లలో బంధించి, సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో అవి వైరల్ అయ్యాయి.
కూకట్ పల్లి ప్రాంతంలో చిరుతపులి... ప్రజల్లో ఆందోళన!

 విషయం తెలుసుకున్న అధికారులు, చిరుత తిరుగుతోందని భావిస్తున్న ప్రాంతానికి వచ్చి, స్థానికుల నుంచి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. అది అసలు చిరుతపులేనా అన్న కోణంలో విచారిస్తున్నామని అన్నారు. కాగా, చిరుత సంచారం వార్తలతో ప్రగతినగర్ వాసులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్న పరిస్థితి. ఈ ప్రాంతంలో కొండలు, చెట్లు ఉండటంతో మరో ప్రాంతం నుంచి తప్పించుకుని వచ్చిన చిరుత, ఇక్కడ చేరిందని స్థానికులు అంటున్నారు.