ఇవాళ్టి నుంచి కబాడీ లీగ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇవాళ్టి నుంచి కబాడీ లీగ్

హైద్రాబాద్, జూలై 19 (way2newstv.com
కబడ్డీ కూతకు వేళయ్యింది. అభిమానులను అలరించేందుకు రెడీ అయిపోయారు క్రీడాకారులు. సై అంటే సై అంటున్నారు శనివారం నుంచి స్థానిక గచ్చబౌలి స్టేడియం వేదికగా ప్రొ కబడ్డీ లీక్ (పీకేఎల్) ఏడో సీజన్ పోటీలకు తెరలేవనుంది. గతంలోలాగే..మొత్తం 11 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ప్రధానంగా అందరి ఫోకస్..తెలుగు టైటాన్స్ జట్టుపై ఉంది. ఈసారి పక్కాగా టైటిల్ కొట్టాలన్న కసితో ఆ జట్టు క్రీడాకారులున్నారు. స్టార్ రైడర్ బాహుబలి సిద్దార్థ్ దేశాయ్ చేరికతో మరింత పటిష్టం అయ్యింది. బుద్ధుడి విగ్రహం వేదికగా 25 అడుగుల భారీ కటౌట్‌తో వేడుకలు జరిగాయి. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌తో పాటు వివిధ జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్లుమిరుమిట్లు గొలిపే బాణాసంచా కాల్చారు. భారత దిగ్గజ ఆటగాళ్లు అనూప్ కుమార్, రాకేశ్ కుమార్ ఏడో సీజన్‌లో సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. 
ఇవాళ్టి నుంచి కబాడీ లీగ్

ఆటకు వీరిద్దరూ వీడ్కోలు పలికారు. వీళ్లిద్దరూ కోచ్‌లుగా మారారు. పుణెరి పల్టాన్‌కు అనూప్, హర్యాణా స్టీలర్స్‌కు రాకేష్ కుమార్‌లు కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. గత సీజన్ లాగే ఈసారి మొత్తం 11 జట్లు టైటిల్ కోసం కొదమ సింహాల్లా కొట్లాడేందుకు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగబోతున్నాయి. ముఖ్యంగా తెలుగు టైటాన్స్ జట్టు ఎలాగైనా టైటిల్ కొట్టాలన్న కసితో కనిపిస్తున్నది. స్టార్‌రైడర్ బాహుబలి సిద్దార్థ్ దేశాయ్ చేరికతో టైటాన్స్ కొత్త రూపు సంతరించుకుంది. ఈ సిద్దార్థ్ దేశాయ్‌తో పాటు టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, బెంగళూరు బుల్స్ కెప్టెన్ రోహిత్ కుమార్, అరుణ్, శివ గణేశ్ రెడ్డి, పల్లె మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు. డ్యాన్స్ ప్రొగ్రామ్‌తో పాటు కండ్లు మిరుమిట్లు గొలిపే పటాకులతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు వెలుగులు విరజిమ్మాయి. గచ్చిబౌలీలో మ్యాచ్‌లు చూసేందుకు అభిమానుల కోసం ప్రత్యేకంగా బస్సు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.