దేవుడా నన్నెందుకు సీఎం చేశావు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దేవుడా నన్నెందుకు సీఎం చేశావు

బోరుమన్న కుమారస్వామి
బెంగళూర్, జూలై 19 (way2newstv.com)
క‌ర్నాట‌క అసెంబ్లీలో ఇవాళ సీఎం కుమార‌స్వామి మాట్లాడారు. బ‌ల‌ప‌రీక్ష తీర్మానం సంద‌ర్భంగా ఇవాళ రెండ‌వ రోజు కూడా సీఎం మాట్లాడారు. మీరే సీఎం కావాలంటూ త‌న‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని, తాను ఎవ‌రి ద‌గ్గ‌రికీ వెళ్ల‌లేద‌న్నారు. సీఎం పీఠం త‌న‌కు ముఖ్య‌మైంది కాద‌ని, కానీ భ‌విష్య‌త్తు త‌రాల‌కు కీల‌కం అన్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగేందుకుకే మ‌న స్వాతంత్ర్య స‌ర‌మ‌యోధులు ప్ర‌జాస్వామ్యాన్ని రూపొందించార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌న‌ను ఎందుకు సీఎంను చేశావ‌ని దేవుణ్ని అడుగుతున్నాని, ఇది నిజంగా త‌ల‌రాతే అన్నారు. బ‌ల‌ప‌రీక్ష‌పై చ‌ర్చ చేప‌డుదామ‌ని, మీరే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయండి, ఇందులో తొంద‌రెందుకు అని బీజేపీని ఉద్దేశిస్తూ సీఎం కామెంట్ చేశారు. సీఎం అధికారాల‌ను దుర్వినియోగం చేయ‌న‌న్నారు. త‌మ కూట‌మి ఎమ్మెల్యేల‌కు ఒక్కొక్క‌రికి 50 కోట్లు లంచం ఇచ్చార‌ని, అది ఎవ‌రి సొమ్ము అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 
దేవుడా నన్నెందుకు సీఎం చేశావు

ఇవాళ కూడా 20 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజ‌రు అయ్యారు. త‌న‌ను ఎవ‌రూ కిడ్నాప్ చేయ‌లేద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ తెలిపారు. హెల్త్ చెక‌ప్ కోసం ముందు చెన్నై వెళ్లి.. అక్క‌డ నుంచి ముంబైకి వ‌చ్చిన‌ట్లు ఎమ్మెల్యే పాటిల్‌.. స్పీక‌ర్‌కు లేఖ ద్వారా తెలిపారు.గురువారమే తెరపడాల్సిన కర్ణాటక రాజకీయ సంక్షోభం అసెంబ్లీని స్పీకర్ వాయిదావేయడంతో శుక్రవారం సైతం కొనసాగుతోంది. అవిశ్వాస తీర్మానంపై విధాన సభలో చర్చ రెండో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ.. తానెప్పుడూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదని, ప్రోత్సహించబోనని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు ఎప్పుడూ బీజేపీ దగ్గరకు వెళ్లలేదని, ఆ పార్టీయే తనను సంప్రదించిందని కుమారస్వామి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి బీజేపీ తూట్లు పొడుస్తోందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఎం పిలుపునిచ్చారు. గత పద్నాలుగు నెలలుగా తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికే ప్రయత్నిస్తున్నారని, సజావుగా పాలన సాగించే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంటున్నారని విమర్శించారు. తనకు సీఎం కుర్చీ ముఖ్యం కాదని, దానిని కాపాడుకోడానికి ప్రయత్నించడం లేదని అన్నారు. అధికారాన్ని తానెప్పుడూ దుర్వినియోగం చేయలేదని, అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని బీజేపీ గ్రహించాలని కుమారస్వామి హితవు పలికారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ 300 సీట్లు సాధించిన అధికారంలోకి వచ్చారు.. కానీ, 1984లో 400 స్థానాలు గెలుపొందిన రాజీవ్ గాంధీకి ఆ తర్వాత బోఫోర్స్ కుంభకోణం ఆరోపణలతో ఏం జరిగిందో గుర్తుచేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ తన సభ్యులను కాపాడుకోలేకపోయిందని కుమారస్వామి చేసిన వ్యాఖ్యలతో అధికార పక్షంలో దుమారం రేగింది. దీంతో కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కుమారస్వామి వ్యాఖ్యలపై మండిపడిన కాంగ్రెస్, ఐదారు కోట్లు ఆఫర్ చేస్తుంటే ఎలా కాపాడుకోగలమని ప్రశ్నించింది. కాగా, బలపరీక్షపై స్పీకర్ రమేశ్ కుమార్ న్యాయసలహా తీసుకుంటున్నారు. రెబల్ ఎమ్మెల్యేల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత సంపాదించినా జానెడు పొట్టకోసమే కాదా? దానికోసం ఇంతగా దిగజారుతారా అని నిలదీశారు. సభలో రెండు వర్గాలకు నైతిక విలువలు లేవని ఆవేదన చెందారు. మరోవైపు, విప్ జారీ అంశం స్పష్టత కోసం సుప్రీంకోర్టును కాంగ్రెస్ ఆశ్రయించిందిఅయితే, సభలో సభ్యుల ఆందోళనల నేపథ్యంలో స్పీకర్‌ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లున్నాయి. ఇందులో 15 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు సభా సమావేశాలకు హాజరు కావడం లేదని తేల్చి చెప్పారు. ఈ ఎమ్మెల్యేల గైర్హాజరీతో సభ్యుల సంఖ్య 209కి చేరింది. ఇక బల పరీక్షలో నెగ్గాలంటే సంకీర్ణ సర్కారుకు 105 మంది సభ్యులు కావాలి. కుమార సర్కారుకు ఉన్న బలం 102 మంది సభ్యులు. ఇందులోనూ స్పీకర్‌ది నిర్ణయాత్మకమైన ఓటు కావడంతో వారి బలం 101కే పరిమితమైంది. మరోవైపు 105 మంది సొంత ఎమ్మెల్యేల బలంతో భాజపా ధీమా వ్యక్తం చేస్తోంది. వీరికి మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల బలం కూడా ఉంది. 107 మంది ఎమ్మెల్యేల బలంతో ఉన్న భాజపానే అధికారం ఏర్పాటు చేస్తుందంటూ ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కుమార ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, బలపరీక్షకు సిద్ధం కావాలని భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప డిమాండ్‌ చేశారు. ఈ కూటమికి 98 ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని, తమకు 105 మంది ఉన్నారని చెప్పారు.