109మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు

మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి జూలై  30, (way2newstv.com)
రాష్ట్రంలోని 109 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.  జీఎంసీలో విలీనం చేసే గ్రామాల పరిస్థితి  అధ్వాన్నంగా 
ఉందన్నారు. 
 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు  

మంగళవారం శాసన మండలిలో ఆయన మాట్లాడారు.  విలీన  గ్రామాలపై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదని బొత్స విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో ఇలాంటి పరిస్థితే ఉందన్నారు.  సమస్యలన్నింటినీ పరిశీలించి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.  కొన్ని కార్పొరేషన్లకు కోర్టు కేసులు ఉన్నాయని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.  

Previous Post Next Post