ఆకస్మికంగా హాస్టల్స్ తనిఖీ చేసి నిద్ర చేస్తా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆకస్మికంగా హాస్టల్స్ తనిఖీ చేసి నిద్ర చేస్తా

వసతి గృహాల విద్యార్థులకు యోగా నేర్పించండి 
- చేర్యాల రెసిడెన్షియల్ పాఠశాలను సిద్ధిపేటకు తేవాలి 
- వార్డెన్ల పనితీరు పై గ్రేడింగ్ ఇవ్వాలి.. అడ్మిషన్లకు వారం గడుగు 
- వారం రోజుల్లో బీసీ, ఎస్సీ బాలికలకు అదనంగా హాస్టల్స్ ఏర్పాటు చేయాలి 
- మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు 
సిద్ధిపేట, జూలై 13 (way2newstv.com): 
వారం, పది రోజుల్లో బీసీ, ఎస్సీ బాలికలకు అదనంగా హాస్టల్స్ “బీ” పేరిట ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని బీసీ, ఎస్సీ కార్పోరేషన్ అధికారులను రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, బీసీ కార్పోరేషన్ ఈడీ సరోజ, మైనారిటీ వెల్ఫేర్ అధికారి జీవ రత్నం, ఎస్సీ కార్పోరేషన్ అధికారిక యంత్రాంగం, హౌసింగ్ కార్పోరేషన్ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, హాస్టల్స్ వార్డెన్లతో పలు వసతి గృహాల సమస్యలు, హాస్టల్స్ లో అడ్మిషన్ల ప్రక్రియ పై సుదీర్ఘంగా సమీక్షించారు. 
ఆకస్మికంగా హాస్టల్స్ తనిఖీ చేసి నిద్ర చేస్తా 

ఈ మేరకు వసతి గృహాల్లోని సమస్యలపై ఆరా తీస్తూ.. సంతకంతో కూడిన కావాల్సిన ప్రతిపాదనలు పంపాలని వసతి గృహల వార్డెన్లకు సూచిస్తూ.. పలు హాస్టల్స్ సమస్యలను సభా సమీక్ష దృష్టికి తీసుకువచ్చారు. పలు సమస్యలపై స్పందిస్తూ.. ఆరా తీస్తూ.. అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రస్తుతం మైత్రి వనంలో ఉన్న ఎస్సీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ను ఎన్సాన్ పల్లికి షిప్ట్ చేయాలని ఆ రెసిడెన్షియల్ పాఠశాల తల్లిదండ్రుల నుంచి వచ్చిన విన్నపం మేరకు డిప్యూటీ సెక్రటరీ విజయ్ భాస్కర్, తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల కార్యదర్శి ప్రవీణ్ లతో ఫోన్ లైనులో మాట్లాడారు. ఎన్సాన్ పల్లి ప్రభుత్వ పాఠశాల కాబట్టి మరో పదేళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఈ విషయమై కావాల్సిన అనుమతులు ఇవ్వాలని కార్యదర్శి ప్రవీణ్ ను కోరారు. ఎన్సాన్ పల్లి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ప్రిన్సిపల్ తో పాటుగా అదనపు ట్రాన్స్ ఫార్మర్, అదనపు మీటరు విద్యుత్ కనెక్షను వెంటనే మంజూరు చేయాలని విద్యుత్ శాఖ ఎస్ఈకి ఫోను లైనులో ఆదేశించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేట నియోజక వర్గంలోని ఎస్సీ, బీసీ, మైనారిటీ వసతి గృహాలలో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని, ఇందుకు కావాల్సిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారిక యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా కావాల్సిన అన్నీ వసతులు ఉన్నాయంటూ.. పిల్లలను ప్రభుత్వం సంక్షేమంగా చూస్తున్నదని బీసీ, ఎస్సీ బాలికల హాస్టల్ కు 300 పైగా దరఖాస్తులు వచ్చాయని, ఇందుకు అనుగుణంగా అవసరమైతే.. అదనంగా హాస్టల్స్ బీ పేరిట ఏర్పాటు చేయొచ్చని అధికారులతో చర్చించి నిర్ణయించారు. ఈ విషయమై వారం రోజుల్లో బీసీ, ఎస్సీ బాలికలకు అదనంగా హాస్టల్స్ ఏర్పాటు చేయాలని వారం, పది రోజుల్లో బీసీ, ఎస్సీ బాలికలకు అదనంగా హాస్టల్స్ “బీ” పేరిట ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజక వర్గంలోని ఎస్సీ, బీసీ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉండాలని, ఎప్పుడైనా ఈ నెల రోజుల్లోనే తాను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని తెలిపారు. పిల్లలతో కలిసి భోజనం చేస్తానని.. వారితోనే నిద్ర కూడా చేస్తానని చెప్పారు. వార్డెన్ లేకపోయినా, విద్యార్థుల నుంచి సమస్యలు ఉన్నాయని తనకు చెప్పినా ఊరుకునే ప్రసక్తే లేదని వార్డెన్లను హెచ్చరించారు. వసతి గృహాలలో చదివే పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత హాస్టల్స్ వార్డెన్లదేనని సూచించారు.