సెప్టెంబర్ 1 నుంచి ఇంటిఇంటికి రేషన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సెప్టెంబర్ 1 నుంచి ఇంటిఇంటికి రేషన్

విజయవాడ, ఆగస్టు 23 (way2newstv.com):
ఏపీ రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది జగన్ ప్రభుత్వం. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలు దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా పేద ప్రజలకు అందాల్సిన నిత్యావసర సరుకుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించింది. ఎలాంటి గోల్ మాల్ జరగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొంటోంది. ఇందు కోసం ప్రభుత్వం తరపున నియమించిన కొంతమంది ద్వారా నిత్యావసర వస్తువులను నేరుగా వారి ఇళ్లకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 
సెప్టెంబర్ 1 నుంచి ఇంటిఇంటికి రేషన్

సెప్టెంబర్ నెల నుంచి ఇది ప్రారంభం కానుంది. ఇందుకోసం 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలోల చొప్పున ప్రత్యేక సంచులను సైతం సిద్ధం చేస్తోంది. పౌరసరఫరాల శాఖ ఇప్పటికే ఈ సంచులను రెడీ చేసి పెట్టింది. ఈ సంచుల్లో రేషన్‌ బియ్యాన్ని ప్యాకింగ్‌ చేయనుంది. ఈ నెలాఖరుకు ఈ సంచులన్నీ రేషన్‌ షాపులను చేరుకోనున్నాయి. గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ బ్యాగ్స్‌ ఇంటింటికి పంపిణీ చేయనున్నట్టు సివిల్‌ సప్లై అధికారులు చెబుతున్నారు. ఈ పాస్ మిషన్లలో సాఫ్ట్ వేర్‌ను అప్ డేట్ చేశారు.దీనిద్వారా ఎక్కడ, ఏ రేషణ్ దుకాణంలో ఎంతమంది లబ్దిదారులు సరుకులు తీసుకెళ్లారో ఆన్ లైన్‌లో అప్ డేట్ అవుతుంది. ఏదైనా రేషన్ షాపులో 50 శాతం సరుకు అయిపోతే..సంబంధిత జిల్లా డీఎస్వోలను అప్రమత్తం చేస్తూ..కేంద్ర కార్యాలయం నుంచి మెసేజ్ వెళుతుంది. తద్వారా సంబంధిత షాపులకు అదనంగా కోటాను అందుబాటులోకి తెస్తారు. మరోవైపు రాష్ట్రంలో రేషన్ సరుకులు ఎక్కడి నుంచైనా తీసుకొనే విధంగా రావడంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. లక్షలాది కుటుంబాలు వలస వెళ్లిన వారికి ఈ విధానం ఎంతో ఉపశమనం కలిగిస్తోంది.