హైదరాబాద్ ఆగష్టు 10 (way2newstv.com)
గ్రేటర్ హైదరాబాద్ లో స్వచ్ఛ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు నగరవాసులను చైతన్యపర్చేందుకు ప్రత్యేకంగా 2వేల మంది కమ్యునిటి రిసోర్స్ పర్సన్ లను నియమిస్తున్నట్టు జిహెచ్ఎంసి కమిషనర్ ఎం.దానకిషోర్ ప్రకటించారు. సాఫ్, షాన్ దార్ హైదరాబాద్ కార్యక్రమం, వాక్ నిర్వహణపై జిహెచ్ఎంసి యు.సి.డి అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నేడు సాయంత్రం జలమండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ దానకిషోర్ తో పాటు అడిషనల్ కమిషనర్లు శృతిఓజా, సిక్తాపట్నాయక్, జలమండలి ఈ.డి సూర్యనారాయణలు పాల్గొన్నారు.
గ్రేటర్ లో స్వచ్ఛ చైతన్యానికి 2వేల సి.ఆర్.పిల నియామకం
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రోజుకు 4,700లకు పైగా మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని, దీనిని కనీసం సగానికి తగ్గించేందుకు గాను సేంద్రీయ ఎరువుల తయారీ, తడి, పొడి చెత్త వేరు చేయడం, చెత్తను స్వచ్ఛ ఆటోలకు అందించడం తదితర కార్యక్రమాల పట్ల నగరవాసులను చైతన్యం చేయడానికి ప్రత్యేకంగా 2వేల మంది సి.ఆర్.పి లను నియమించడానికి అనుమతించాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు. నగరంలో 1,090 స్లమ్ లేవల్ ఫెడరేషన్లు ఉన్నాయని, ఈ ఎస్.ఎల్.ఎఫ్ ప్రతినిధుల ద్వారా నగర సమస్యలను సేకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను జిహెచ్ఎంసి, జలమండలిలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
Tags:
telangananews