ఆగస్ట్ 23న వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్మెంట్స్ ‘ఏదైనా జరగొచ్చు’ విడుదల.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆగస్ట్ 23న వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్మెంట్స్ ‘ఏదైనా జరగొచ్చు’ విడుదల..

(way2newstv.com - Swamy Naidu):
నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఏదైనా జరగొచ్చు. ఆగస్ట్ 23న ఈ చిత్రాన్ని విడుదల కానుంది. ఈ యాక్షన్ కామెడీ హార్రర్ థ్రిల్లర్‌ను కె రమాకాంత్ తెరకెక్కిస్తున్నారు. పూజా సోలంకీ, శశి సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ నటుడు బాబీ సింహా కీలక పాత్రలో నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, నాగబాబు ఇతర సహాయ పాత్రల్లో నటిస్తున్నారు. 
 ఆగస్ట్ 23న వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్మెంట్స్ ‘ఏదైనా జరగొచ్చు’ విడుదల.. 
ఏదైనా జరగొచ్చు పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. శ్రీకాంత్ పెండ్యాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ ఏదైనా జరగొచ్చు సినిమాను నిర్మిస్తున్నారు. 
నటీనటులు:విజయ్ రాజా, బాబీ సింహా, పూజా సోలంకీ, శశి సింగ్, రవి శివ తేజ, వైవా రాఘవ, నాగబాబు, వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్ తదితరులు