టిటిడి స్థానిక ఆలయాలలో ఆగస్టు 23న గోకులాష్టమి వేడుకలు

తిరుపతి, ఆగస్టు 21 (way2newstv.com)  
తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీ   కృష్ణ  స్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, నారాయణవనం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయం, కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయాలలో ఆగస్టు 23వ తేదీ శుక్రవారం గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. అదేవిధంగా ఆగష్టు 24వ తేదీ ఉట్లోత్సవం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
టిటిడి స్థానిక ఆలయాలలో ఆగస్టు 23న గోకులాష్టమి వేడుకలు

తిరుచానూరులోని శ్రీ  కృష్ణ స్వామివారి ఆలయంలో 
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీ   కృష్ణ స్వామివారి ఆలయంలో ఆగస్టు 23వ తేదీన గోకులాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొదటిరోజు గోకులాష్టమి ఆస్థానం, రెండో రోజు ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.
గోకులాష్టమి రోజైన శుక్రవారం ఉదయం శ్రీ  కృష్ణ స్వామి మూలవర్లకు అభిషేకం,అర్చనలు మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్సేవ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6.45 నుండి రాత్రి 8.00 గంట వరకు స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. అదేవిధంగా  ఆగస్టు 24న శనివారం సాయంత్రం 6.00 నుండి 7.30 గంటల వరకు ఉట్లోత్సవం, ఆస్థానం వైభవంగా జరుగనుంది.
Previous Post Next Post