ఆర్టికల్ 370 రద్దును స్వాగతిస్తూ ఏబీవీపీ సంబరాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆర్టికల్ 370 రద్దును స్వాగతిస్తూ ఏబీవీపీ సంబరాలు

ఎమ్మిగనూరు ఆగస్టు 6, (way2newstv.com)
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎమ్మిగనూరు ఏబివీపి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తూ ఆనందోత్సాహాలతో సంబురాలు జరుపుకున్నారు. సోమవారం పట్టణంలోని సోమప్ప సర్కిల్ లో విద్యార్థులు జాతీయ జెండాలను పట్టుకొని ఊరేగింపుగా వచ్చి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. 
ఆర్టికల్ 370 రద్దును స్వాగతిస్తూ ఏబీవీపీ సంబరాలు

ఈ సందర్భంగా ABVP నాయకులు రఘునాథ్,ప్రభాకర్ లు మాట్లాడుతూ..ప్రధాని దేశం గర్వించదగ్గ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాల సాహసోపేత నిర్ణయం వల్లనే ఆర్టికల్ 370 రద్దు సాధ్యమైందని అన్నారు. కార్యక్రమంలో విద్యార్ధి సంఘం నాయకులు ప్రభాకర్, అఫ్రిద్, నవీన్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.